రోజుకు ఎన్ని మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి మంచిది? మెట్లతో ఇన్ని లాభాలా?

July 20, 2026

Subhash

రోజుకు కొద్దిసేపు మెట్లు ఎక్కడం గుండె ఆరోగ్యం, ఫిట్‌నెస్, క్యాలరీలు ఖర్చు చేయడంలో మంచి వ్యాయామంగా పరిగణిస్తారు నిపుణులు. రోజువారిగా మెట్లు ఎక్కడం ఎంతో మేలుంటుంది.

రోజూ మెట్లు ఎక్కుతున్నారా?

నిపుణుల సూచన ప్రకారం రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కడం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు

రోజుకు ఎంత ఎక్కాలి?

క్రమం తప్పకుండా మెట్లు ఎక్కేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం సుమారు 20% వరకు తగ్గవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

గుండెకు మేలు

మెట్లు ఎక్కడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. ఇది కొవ్వు తగ్గించడంలో కీలక పాత్ర  పోషిస్తుంది. అలాగే శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయం

మెట్లు ఎక్కడం వల్ల కాళ్లు, తొడలు, నితంబాలు (Glutes), కోర్ కండరాలు బలపడతాయి. అందుకే మెట్లు ఎక్కడం సమర్థవంతమైన వ్యాయామం.

కండరాలు బలపడతాయి

మొదట 1–2 ఫ్లైట్స్‌తో ప్రారంభించి, మీ శక్తికి అనుగుణంగా క్రమంగా సంఖ్యను పెంచండి. ఒక్కసారిగా ఎక్కువ మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించవద్దు. ఇబ్బంది పడతారు.

ఎలా ప్రారంభించాలి?

మోకాళ్ల నొప్పి, గుండె సమస్యలు లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు వైద్యుల సలహాతోనే ఈ వ్యాయామం చేయాలి.

ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?

లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎంచుకోవడం ద్వారా రోజువారీ జీవితంలోనే మంచి వ్యాయామం పొందవచ్చు. మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్ణయించుకుని క్రమం తప్పకుండా కొనసాగించండి.

చిన్న అలవాటు... పెద్ద లాభం