Anupama Parameswaran: ఆ హీరోను అన్ ఫాలో చేసిన అనుపమ.. ఇకపై ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ పోస్ట్.. అసలేం జరిగిందంటే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ కేరళ కుట్టి.. ఇటీవల పర్సనల్ విషయాలతో వార్తలలో నిలుస్తుంది. ఓ స్టా్ర్ హీరోతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని మొన్నటివరకు ప్రచారం నడవగా.. ఇప్పుడు అతడితోనే బ్రేకప్ అయ్యిందంటూ మరో న్యూస్ తెరపైకి వచ్చింది.

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి.. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామరస్ పాత్రలతో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది అరడజను సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే కొన్ని రోజులుగా అనుపమ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్ తో ఆమె ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రూమర్స్ పై అటు అనుపమ గానీ.. ఇటు ధృవ్ విక్రమ్ గానీ స్పందించలేదు. కానీ కొన్ని రోజులాగ అనుపమ నెట్టింట సైలెంట్ అయ్యింది. ఆమె చివరగా మే నెలలో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట యాక్టివ్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
ఇకపై తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని.. ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు.. వేరొకరి అప్రూవల్స్ కోసం, క్యాప్షన్స్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదని.. తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటానని రాసుకొచ్చింది. “కొన్నిసార్లు, మనశ్శాంతిని పొందాలంటే ఫలితం లేని దారులను వదిలేయాల్సిందే. ఈ రోజు, ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్షణం నుండి, నా గళాన్ని నేనే ఎంచుకుంటున్నాను. నా జీవితాన్ని నేనే ఎంచుకుంటున్నాను. ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. భయానికి తావు లేదు. కేవలం నేను… నన్ను నేను తిరిగి కనుగొంటూ, ఒకప్పుడు నాదే అని మర్చిపోయిన ఆ జీవితాన్ని మళ్లీ ప్రేమిస్తూ సాగిపోతున్నాను. అలాగే, చాలా కాలంగా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఉంది… చాలా కాలం పాటు చెప్పడానికి నాకు అవకాశం దక్కని విషయం అది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు, నన్ను నమ్మినందుకు , నా జీవితాన్ని ఎంతో ప్రేమతో నింపినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ ఇంతకుముందు నేను దీన్ని తగినంతగా చెప్పలేకపోయి ఉంటే, నా మనసులో ఆ భావన ఎప్పుడూ ఉండేదని దయచేసి తెలుసుకోండి. నాకు అత్యంత అవసరమైన సమయంలో మీ ప్రతి సందేశం, ప్రతి ప్రార్థన మరియు మీ ప్రతి ప్రేమపూర్వక స్పందన నన్ను చేరాయి. నన్ను తిరిగి నా వైపు నడిపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది స్వస్థతకు (healing) స్వాగతం. స్వేచ్ఛకు స్వాగతం. నన్ను నేను ఎంచుకోవడానికి స్వాగతం. మరియు చివరకు, పూర్తిగా, ఏ సంకోచమూ లేకుండా నాదైన జీవితానికి స్వాగతం” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది అనుపమ..
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
అనుమప పోస్ట్..
View this post on Instagram
ప్రస్తుతం అనుపమ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మరిన్ని ఫోటోస్ పెట్టింది. అయ్యో.. వరుసగా ఇన్ని ఫోటోస్ పెట్టినందుకు క్షమించండి.. ఒక విషయం అర్థమైంది. మనం ఎవరి ఆమోదాల కోసమో.. ఒక పాట ఎంపిక కోసమో.. లేదా వేరొకరు రాసే క్యాప్షన్ కోసమో వేచి చూడాల్సిన అవసరం లేనప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా సరదాగా ఉంటుందని రాసుకొచ్చింది. దీంతో బ్రేకప్ గురించి చెప్పకనే చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
అనుమప పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
