Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' విడుదలకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. అయితే అదే సమయంలో విడుదల కానున్న హాలీవుడ్ చిత్రాల కారణంగా ఐమ్యాక్స్ స్క్రీన్ల లభ్యతపై చర్చ మొదలైంది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఈ చిత్రం కోసం అవసరమైతే విడుదల తేదీపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వారణాసికి అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి.. ఫస్ట్ టైమ్ రాజమౌళి కూడా చెప్పినట్లుగానే సినిమాను ఆన్ టైమ్ తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నా.. వారణాసికి ఐమ్యాక్స్ స్క్రీన్స్ దెబ్బ పడేలా ఉంది. వరసగా వస్తున్న హాలీవుడ్ సినిమాలే వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరిప్పుడు జక్కన్న దారెటు..? ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా..? రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చేస్తూనే.. ప్రమోషన్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారీయన. 2027, ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుంది. కానీ సరిగ్గా అదే టైమ్‌లో హాలీవుడ్ నుంచి మార్చి 26న ‘గాడ్జిల్లా ఎక్స్‌కాంగ్’.. ఏప్రిల్ 9న ‘పానిక్ కేర్ ఫుల్లీ’ థియేటర్లలోకి రాబోతున్నాయి. దాంతో ఈ మూడింటి మధ్య ఐమ్యాక్స్ స్క్రీన్స్ పంపకం ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమ్యాక్స్ స్క్రీన్స్ సంఖ్య పరిమితంగా ఉండటమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్‌లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం ‘వారణాసి’కి డేంజర్ సిగ్నల్ లాంటిదే. ఎందుకంటే అక్కడ రిలీజ్‌కు ఆర్నెళ్ల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతుంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందుగా అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమ్యాక్స్ రీచ్ కోసం అవసరమైతే ముందు ముందు ఏ మార్పైనా జరగొచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.. కాంప్రమైజ్ కారు. అందుకే పరిస్థితులను బట్టి వారణాసి రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఒక సాలిడ్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్
పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!
ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్
టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు
తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

