AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

Phani CH
|

Updated on: Jul 19, 2026 | 10:34 AM

Share

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. లోకల్-నాన్ లోకల్ డ్యాన్సర్ల ఎంపిక, కమిషన్ల ఆరోపణలు, అసోసియేషన్ ఎన్నికలు, ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం, రామ్ చరణ్ అందించిన ఇన్సూరెన్స్ నిధులు వంటి అంశాలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. అసలు గొడవ ఎలా మొదలైంది? పరిష్కారం ఏమిటో ఈ ఎక్స్‌ప్లైనర్‌లో తెలుసుకుందాం.

టాలీవుడ్ డ్యాన్స్.. దీనికి ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది. మన హీరోల స్టెప్పులైనా, వాటి వెనుక వందలాది మంది డ్యాన్సర్ల సింక్రనైజేషన్ అయినా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. ఆస్కార్ స్టేజ్ పైనా మన డ్యాన్స్ సత్తా చాటింది. కానీ, తెరపై అంతలా అలరించే టాలీవుడ్ డ్యాన్సర్స్ జీవితాల్లో ఇప్పుడు ఒక పెద్ద కుదుపు వచ్చింది. తెర వెనుక ఉన్న వివాదాలు, ఆరోపణలు, కమిషన్ల దందాలు ఇప్పుడు నడిరోడ్డుపైకి వచ్చాయి. ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ల మధ్య పోటీ ఉండేది, కానీ ఇప్పుడు ఏకంగా డ్యాన్సర్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకవైపు ప్రస్తుత చైర్మన్ సుమలత,జానీ మాస్టర్ వర్గం.. మరోవైపు శేఖర్ మాస్టర్ సెంట్రిక్‌గా ఉన్న ఇంకో వర్గం. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? లోకల్, నాన్-లోకల్ డ్యాన్సర్ల వివాదం ఏంటి? డ్యాన్సర్ల జీతాల్లో దళారులు ఎలా కమిషన్లు దండుకుంటున్నారు? రామ్ చరణ్ ఇచ్చిన రూ. 40 లక్షల ఇన్సూరెన్స్ కథ ఏంటి? ఫిల్మ్ ఫెడరేషన్ ఎందుకు రంగంలోకి దిగింది? జానీ మాస్టర్‌ను బ్యాన్ చేస్తామంటూ ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? ఈ ఎక్స్‌ప్లేనర్ వీడియోలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ వివాదానికి అతిపెద్ద కేంద్ర బిందువు.. లోకల్ వర్సెస్ నాన్-లోకల్ వివాదం. సాధారణంగా తెలుగు సినిమాల్లో డ్యాన్స్ సాంగ్స్ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన స్థానిక డ్యాన్సర్లను తీసుకోవాలి అనేది ఒక నియమం. కానీ, కొన్నేళ్లుగా పెద్ద సినిమాల్లో గ్లామర్ కోసమో, లుక్ కోసమో ముంబై లేదా ఇతర రాష్ట్రాల నుంచి డ్యాన్సర్లను ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఇందుకోసం యూనియన్‌లో ఒక ‘రేషియో’ ఉంది. నియమాల ప్రకారం.. ఒక పాటలో 70% లోకల్ డ్యాన్సర్లు ఉంటే, కేవలం 30% మాత్రమే నాన్-లోకల్ డ్యాన్సర్లను తీసుకోవాలి. కానీ శేఖర్ మాస్టర్ వర్గం అండ్ కొంతమంది సభ్యుల ఆరోపణ ఏంటంటే.. ఈ నియమాలను కొందరు పెద్ద డ్యాన్స్ మాస్టర్లు తుంగలో తొక్కుతున్నారని. 100 మంది డ్యాన్సర్లు కావాలంటే 70 మందిని ముంబై నుంచే తెచ్చుకుంటున్నారు, దీనివల్ల స్థానిక డ్యాన్సర్ల పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడే జానీ మాస్టర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. జానీ మాస్టర్ రూల్స్ అతిక్రమించి ముంబై డ్యాన్సర్లకే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఒక వర్గం ప్రచారం చేసింది. అయితే దీనిపై జానీ మాస్టర్ వర్గం వాదన వేరేలా ఉంది. సినిమా దర్శకుడు, ప్రొడ్యూసర్ల రిక్వైర్మెంట్ మేరకే డ్యాన్సర్ల ఎంపిక జరుగుతుందని, ఇందులో మాస్టర్ల ప్రమేయం కంటే సినిమా అవుట్‌పుట్ ముఖ్యం అని వారు సమర్థించుకుంటున్నారు. ఈ గొడవలో మరో షాకింగ్ ఎలిమెంట్.. “కమిషన్ల దందా”. డ్యాన్సర్లు రాత్రింబగళ్లు కష్టపడితే వారికి వచ్చే వేతనం లో దళారులు, కొందరు యూనియన్ ప్రతినిధులు భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా నాన్-లోకల్ డ్యాన్సర్లను ఇక్కడికి రప్పించినప్పుడు, వారికి ఇచ్చే పేమెంట్‌లో కొంత శాతం సెక్రటరీ లేదా మధ్యవర్తులకు “కమిషన్” రూపంలో వెళ్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఒక ఆడియో లీక్ ద్వారా.., కొంతమంది డ్యాన్సర్లు ధైర్యం చేసి బయటకు మాట్లాడటంతో వెలుగుచూసింది. తాము కష్టపడితే వచ్చే డబ్బుల్లో పెద్ద మొత్తాన్ని దళారులు దోచుకుంటుంటే, అసోసియేషన్ ఏం చేస్తోందని సాధారణ డ్యాన్సర్లు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో అసోసియేషన్ లోని లోపాలు, అవినీతి ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఈ వివాదంలో జానీ మాస్టర్ వైపు నుంచి బలమైన వాదనలు కూడా ఉన్నాయి. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ జానీ మాస్టర్ తన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తానే స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లి మాట్లాడి, డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ. 40 లక్షల ఫండ్‌ను తీసుకొచ్చానని ఆయన చెప్పారు.అంతేకాదు, తాను పెద్ది సినిమా కోసం తీసుకున్న రూ. 18 లక్షల రెమ్యునరేషన్‌ను కూడా సొంతానికి వాడుకోకుండా, అసోసియేషన్ సభ్యుల ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసమే డొనేట్ చేస్తున్నాని ప్రకటించాడు. “నేను అసోసియేషన్ మేలు కోరినవాడిని, డ్యాన్సర్ల కోసం నా సొంత డబ్బులు ఇచ్చినవాడిని.. నన్ను అవినీతిపరుడిగా ఎలా చిత్రీకరిస్తారు?” అనేది జానీ మాస్టర్ ప్రశ్న. గొడవ పెద్దదవ్వడంతో.. ప్రస్తుత చైర్మన్ సుమలత బాడీలోని మెజారిటీ సభ్యులు.. శేఖర్ మాస్టర్ వర్గం సపోర్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మెజారిటీ సభ్యులు లేరు కాబట్టి, ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే కొత్తగా జనరల్ ఎలక్షన్స్ పెట్టాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. కానీ ఇక్కడే జానీ మాస్టర్, చైర్మన్ సుమలత వర్గం చట్టపరమైన పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. వారి వాదన ప్రకారం.. యూనియన్ బైలాస్ అండ్ కార్మిక సంఘం చట్టాల ప్రకారం.. మెజారిటీ సభ్యులు రాజీనామా చేసినంత మాత్రాన ఉన్న బాడీ రద్దు కాదు. ఖాళీ అయిన స్థానాలకు మాత్రమే “ఉప ఎన్నికలు” నిర్వహించాలి కానీ, చైర్మన్ పదవిలో ఉన్న సుమలతను బలవంతంగా దించేయడానికి వీల్లేదు. అయితే, ప్రత్యర్థి వర్గం మాత్రం ఉప ఎన్నికలు వద్దు.. టోటల్ ఎలక్షన్స్ జరగాల్సిందే అని పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవలు రోడ్డుకెక్కడం, షూటింగులకు ఆటంకం కలిగే పరిస్థితి రావడంతో.. టాలీవుడ్‌లోని అన్ని 24 క్రాఫ్ట్స్ యూనియన్లకు మాతృసంస్థ అయిన “తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య” అదే ఫిల్మ్ ఫెడరేషన్ రంగంలోకి దిగింది. నిజానికి, డ్యాన్సర్స్ అసోసియేషన్ అనేది ఫెడరేషన్ అనుబంధ సంస్థ. కాబట్టి అక్కడ శాంతిభద్రతలు కాపాడటం కోసం ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. కానీ ఈ జోక్యంపై సుమలత, జానీ మాస్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఒక వర్గానికే కొమ్ముకాస్తోందని ఆరోపిస్తూ వారు లేఖలు విడుదల చేశారు. ఈ లేఖల సారాంశం ఫెడరేషన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఫెడరేషన్ నిబంధనలను, పెద్దలను గౌరవించకుండా ప్రెస్ నోట్స్ ఇవ్వడంపై జానీ మాస్టర్‌పై ఫెడరేషన్ సీరియస్ అయింది. ఫెడరేషన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరిశ్రమ నుంచి ‘బ్యాన్’ చేయాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై జానీ మాస్టర్ వర్గం కూడా లీగల్‌గా వెళ్తామని సవాల్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మరి ఈ ఇష్యూపై ఇండస్ట్రీ పెద్దలు ఏమంటున్నారు? తెలుగు ఇండస్ట్రీలో ఏ గొడవ జరిగినా ‘ఫిల్మ్ ఛాంబర్’ లేదా పెద్దలు కూర్చొని పరిష్కరించుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతానికి కొందరు పెద్దలు ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. జానీ మాస్టర్‌కు, శేఖర్ మాస్టర్‌కు మధ్య వ్యక్తిగత ఈగో గొడవలు ఏవీ లేవని ఇరువర్గాలు చెబుతున్నప్పటికీ.. అసోసియేషన్ పీఠంపై పట్టు కోసం, అలాగే లోకల్ డ్యాన్సర్ల హక్కుల కోసమే ఈ పోరాటం అని క్లియర్ గా అర్థమవుతోంది. భారతదేశంలోనే టాలీవుడ్ డ్యాన్సర్లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాంటిది వీరంతా ఇలా రోడ్డుకెక్కి కొట్టుకోవడం వల్ల పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతింటుంది.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇరు వర్గాలు శాంతించాలంటే ఏం చేయాలంటే..

నెం.1. మొదటగా ఫెడరేషన్ మరియు ఛాంబర్ పెద్దల సమక్షంలో ఇరు వర్గాల ముఖ్య నేతలు ఈగోలు పక్కన పెట్టి చర్చలకు కూర్చోవాలి.

2. లోకల్, నాన్-లోకల్ 70:30 రూల్‌ను పక్కాగా అమలు చేసేలా ఒక పారదర్శకమైన డిజిటల్ సిస్టమ్‌ను తీసుకురావాలి.

3. కమీషన్ల దందాను అరికట్టడానికి డ్యాన్సర్ల వేతనాలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో పడేలా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి.

4. చట్టపరంగా బైలాస్ ఏం చెబుతున్నాయో దాని ప్రకారం ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు నిర్వహించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి.

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుంది. డ్యాన్సర్ల సంక్షేమమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆశిద్దాం. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? జానీ మాస్టర్ వాదన కరెక్టా? లేక శేఖర్ మాస్టర్ వర్గం అడుగుతున్నట్లు కొత్త ఎన్నికలు పెట్టాలా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD

Follow Us