ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మరోసారి తన సత్తా చాటింది. మొత్తం 43 విభాగాల్లో టాలీవుడ్ ఏకంగా 8 అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. 'కల్కి 2898 AD', 'కమిటీ కుర్రోళ్లు', 'పుష్ప 2', 'లక్కీ భాస్కర్' చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకోగా, తెలుగు ప్రతిభకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్రాల హవా నడిచింది. మొత్తం 43 కేటగిరీలకు గానూ టాలీవుడ్ ఏకంగా 8 అవార్డులను కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. వీఎన్ ఆదిత్య తెలుగు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించిన ఈ పోటీలో, దాదాపు 400 సినిమాలు స్క్రీనింగ్‌కు వచ్చాయి. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో – తెలుగు విజేతల గురించి చెప్పాలంటే.. ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD’ అవార్డ్ అందుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నికైంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే & బెస్ట్ డైలాగ్ రైటర్ గా లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి కి అవార్డ్ దక్కింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ గా పుష్ప2 ది రూల్ సినిమాకు గాను.. సుకుమార్ బండ్రెడ్డి ని అవార్డ్ వరిచింది., ఉత్తమ బాలల చిత్రం: విభాగంలో.,. 35-చిన్న కథ కాదు’ సినిమాకి.. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో.. ‘కల్కి 2898 AD’కి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్స్ విభాగంలో… పుష్ఫ సినిమాకి గాను దీపాలీ నూర్, షీతల్ శర్మ కు… ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో… కమిటీ కుర్రాళ్లు సినిమాకి గాను పి. రవి కుమార్ కి అవార్డ్ వరిచింది. ఫీచర్ ఫిలింస్ కేటగిరిలో కెప్టెన్ మిల్లర్ సినిమాలోని నటనకు గానూ కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే తమిళ చిత్రం ‘మెయి అళగన్’ తెలుగులో ‘సత్యం సుందర్’ సినిమాకు గానూ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్ జి కి కూడా స్పెషల్ మెన్షన్ లభించింది చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల వరకు అన్ని విభాగాల్లోనూ తెలుగు ప్రతిభకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కడంతో.. ఇండస్ట్రీలో అందరూ ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సింపుల్‌గా సమంత సీమంతం వేడుక!
The Odyssey craze: షాకింగ్.. సినిమా చూడడం కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్న లేడీ
Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!
‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

