పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!
ఒకప్పుడు నిర్మాతలను భయపెట్టిన 'A' సర్టిఫికెట్ ఇప్పుడు భారీ సినిమాలకు సాధారణంగా మారుతోంది. 'జన నాయగన్', 'DC', 'టాక్సిక్' వంటి చిత్రాలు అడల్ట్ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడితే బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం ఉంటుందా అనే చర్చ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
A సర్టిఫికేట్ అంటే దర్శక నిర్మాతలకు ఒకప్పుడు చాలా భయం ఉండేది.. కానీ ఇప్పుడలా కాదు. భారీ సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ అందుకుంటున్నాయి. పెద్ద సినిమాలను కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపై ఈ ప్రభావం పడదా..? రాబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఈ అడల్ట్ సర్టిఫికెట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను రప్పించగలవా..? విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’కు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. జులై 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు తేల్చి చెప్పారు. వైల్డ్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని పొలిటికల్ పంచులు కూడా ఎక్కువగానే ఉండటంతో ఈ సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆపేంత అడల్ట్ సినిమాయేం కాదు. మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న ‘DC’ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. అరుణ్ మాత్తేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఇందులో వైలెన్స్ డోస్ ఎక్కువగానే ఉండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కాస్త కష్టమే. కంటెంట్ చాలా డార్క్ అండ్ వైల్డ్‌గా ఉండటంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు అడల్ట్ ముద్ర వేశారు. KGF స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాకు A సర్టిఫికెట్ రావడం లాంఛనమే. కంటెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది పెద్దలకు మాత్రమే అని. ఆగస్ట్ 26న రానుంది టాక్సిక్. ఇలా పెద్ద సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి అడల్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాకపోతే అనుకున్న వసూళ్లు రాబట్టడం కష్టమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్
టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు
తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?
ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

