Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్
'కరుప్పు' విజయంతో సూర్య కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. 'విశ్వనాథ్ అండ్ సన్స్' విడుదలకు సిద్ధమవుతుండగానే, జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్య 47' షూటింగ్‌ను పూర్తి చేశారు. మరోవైపు జ్ఞానవేల్ దర్శకత్వంలోని చిత్రం కూడా వేగంగా సాగుతోంది. వరుస ప్రాజెక్టులతో సూర్య పూర్తి జోష్‌లో దూసుకెళ్తూ అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.
హిట్టిచ్చే జోష్ మరేదీ ఇవ్వదు. కావాలంటే సూర్యనే చూండి.. కరుప్పు తర్వాత ఈయన జోరు మామూలుగా లేదు.. అసలేమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారీయన. ఓ సినిమా తర్వాత మరో సినిమాతో రాకెట్‌లా దూసుకుపోతున్న సూర్య అదిరిపోయే లైనప్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. తాజాగా మరో సినిమా పూర్తి చేసారు ఈ హీరో. కరుప్పు సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్‌తో తన స్పీడ్ అమాంతం పెంచేసారు సూర్య. కరుప్పు కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ వీరభద్రుడుగా వచ్చి విజయం అందుకుంది. ఇప్పుడు ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్‌తో రాబోతున్నారీయన. పైగా ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమాల హడావిడి ఇలా ఉండగానే జీతూ మాధవన్ దర్శకత్వంలో చేస్తున్న సూర్య 47 సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో నజ్రియా నజీమ్‌తో పాటు ప్రేమలు హీరో నెస్లన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇలా సైలెంట్‌గా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తూ సూర్య ఎక్కడా తగ్గట్లేదు. అన్నీ కుదిర్తే సూర్య 47 కూడా 2026లోనే విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు.. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్షన్‌లో చేస్తున్న 48వ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది.. షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. దీని తర్వాత లైన్‌లో మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు సూర్య కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తానికి సూర్య ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతూ తన ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!
ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్
టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు
తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

