AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మార్కెట్‌లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!

మార్కెట్‌లోకి కొత్త దొంగలు వచ్చారు.. వీళ్ల రూటే వేరు.. వీళ్లు దొంగతనం చేసే పద్ధతే సపరేటు. వీళ్లు అందరిలా దోచుకోరు.. ఆపదలో ఉన్నట్టు నటిస్తారు.. నమ్మి దగ్గరికి వచ్చిన వారిని నట్టేట ముంచేస్తారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటి.. వీళ్లు ఎలా దోచుకుంటారో క్లారిటీగా తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.

Viral Video: మార్కెట్‌లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!
Warangal Crime News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 20, 2026 | 8:39 AM

Share

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను బురిడీ కొట్టించేందుకు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో కొందరు దొంగలు సరికొత్త మోసాలకు తెరలేపారు. వీళ్లు అందరిలాంటి దొంగలు కాదు.. వీళ్లదో టైపు.. ఆపదలో ఉన్నట్లు నటిస్తారు. నమ్మి సహాయం చేయడానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసి తెరిచేలోపే జేబు ఖాళీ చేస్తారు. తాజాగా వరంగల్‌లో జరిగిన చోరీ ఘటన చూస్తే ఆ కేటుగాళ్లు ఎలా డైవర్షన్ దోపిడీలకు పాల్పడతారో మీకే అర్థం అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. బైరెడ్డి సోమిరెడ్డి అనే వ్యక్తి వరంగల్ శివారు నాయుడు పంపు సమీపంలో బైక్‌పై వెళ్తున్నాడు. అతను రోడ్ క్రాస్ చేసేందుకు వేచి చూస్తుండగా.. అతని పక్కనే మరో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి బైక్‌పై నుండి కింద పడుతున్నట్లుగా నటించాడు. కాలు జారి పడినట్లు నటించి ‘ప్లీజ్ హెల్ప్’ అని కోరాడు. అది చూసిన సోమిరెడ్డి చలించి అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. కిందపడిన వ్యక్తిని పైకి లేపుతుండగా.. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి సైలెంట్‌గా సోమిరెడ్డి పాకెట్‌లో ఉన్న మొబైల్‌ను కొట్టేశాడు.

తర్వాత ఏమీ ఎరగనట్టు ఆ ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. అయితే వాళ్లు వెళ్లిపోయాక పాకెట్‌లోని మొబైల్ కనిపించకపోవడాన్ని గమనించిన సోమిరెడ్డి మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వాళ్లు ఆడిందంతా నాటకమని తేలింది.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇలాంటి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకుల వద్ద ఇలాంటి ముఠాలు సంచరిస్తూ ఉంటాయని తెలిపారు. జనాలకు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us