Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు
వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ ఆశలన్నీ 'కొరియన్ కనకరాజు'పైనే ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుండటంతో ఇటీవల విజయాలు సాధించిన సీమ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంట్ తనకూ కలిసొస్తుందని మెగా హీరో భావిస్తున్నారు. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌కు కీలక మలుపు కానుందనే అంచనాలు ఉన్నాయి.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈసారి సూపర్ హిట్ సెంటిమెంట్ పట్టుకున్నారు.. అదే తనను ఒడ్డున పడేస్తుందని నమ్ముతున్నారాయన. ఈ మధ్య కాలంలో సమంత, అఖిల్, కిరణ్ అబ్బవరంలకు కలిసొచ్చిన బ్యాక్‌డ్రాపే తనకు కూడా కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నారు మెగా హీరో. ఇంతకీ ఏంటా సెంటిమెంట్.. అది వరుణ్ తేజ్ కెరీర్‌ను కూడా మార్చేస్తుందా..? విభిన్నమైన కథలను ఎంచుకునే వరుణ్ తేజ్.. ఈసారి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రానుంది. రాయలసీమలో మొదలయ్యే కథ కొరియాకి వెళ్తుంది. అక్కడ్నుంచి ఏం జరుగుతుందనేది అసలు కథ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే ఉంది. పైగా వరుణ్ తేజ్‌కు సీమ సెంటిమెంట్ హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర రాయలసీమ నేపథ్యంతో వచ్చిన సినిమాలకు కలెక్షన్లు అదిరిపోతున్నాయి. మొన్న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఏకంగా 100 కోట్లు వసూలు చేస్తే.. అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి అనే చిన్న సినిమా కూడా మెప్పించింది. సరిగ్గా ఇదే సీమ సెంటిమెంట్‌ను నమ్ముకుని వరుణ్ తేజ్ వస్తున్నారిప్పుడు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకు కొరియన్ కనకరాజు విజయం కీలకంగా మారింది. అందుకే ట్రెండింగ్‌లో ఉన్న సీమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు వరుణ్. మరోవైపు మేర్లపాక గాంధీకి కూడా ఈ సినిమా విజయం కీలకమే. చూడాలిక ఇద్దరూ కలిసి ఏం చేస్తారో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?
Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్
పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

