Cheppave Chirugaali: ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలో సునీల్‌ను ఓ ఆటాడుకున్న ఈ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇందులో వేణు తొట్టెంపూడి హీరోగా నటించారు. ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని నటనతో తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. పెద్దగా అవకాశాలు రాకపోయినా.. చిన్న సినిమాలతోనే బాగా పాపులర్ అవుతుంటారు. పేడౌట్ అయిన కూడా కొన్ని సినిమాలతో ఆడియన్స్ వారిని అంత ఈజీగా మర్చిపోలేరని చెప్పవచ్చు. అదే తరహాలో చిన్న సినిమాతోనే క్రేజ్ అందుకున్న హీరోయిన్ అభిరామి. ఆమెను చూడగానే గుర్తొచ్చే సినిమా చెప్పవే చిరుగాలి. ఇందులో వేణు తొట్టెంపూడి హీరోగా నటించారు. ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో థాంక్యూ సుబ్బరావ్, చార్మినార్ వంటి సినిమాలు చేసింది అభిరామి. 200 వరకు తెలుగు తమిళం, కన్నడ, మలయాళంలో వరుసగా సినిమాలు చేసిన అభిరామి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ పదేళ్ల తర్వాత 2014లో మలయాళం సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కేవలం నటిగానే కాకుండా పలువురు కథానాయికలకు డబ్బింగ్ చెబుతున్నారు.
రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో హీరో తల్లి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అభిరామి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం ఫోటోస్, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంటారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.