Balagam: ‘సిరిసిల్ల బతుకమ్మ ఘాట్‌ కాడా బలగం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌’.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌.

కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం 'బలగం'. నిర్మాత దిల్‌రాజు కూతురు హర్షిత నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. పూర్తిగా తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తోంది...

Balagam: 'సిరిసిల్ల బతుకమ్మ ఘాట్‌ కాడా బలగం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌'.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌.
Balgam Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2023 | 2:05 PM

కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. నిర్మాత దిల్‌రాజు కూతురు హర్షిత నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. పూర్తిగా తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది.

చిత్ర యూనిట్ కాస్త వెరైటీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణలోని సిరిసిల్లలో ఈవెంట్‌ను ఈరోజు (ఫిబ్రవరి 28) నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ప్రియదర్శిని ట్విట్టర్‌ వేదిగా తెలిపారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. ’28వ తేదీ రోజు, బతుకమ్మ ఘాట్‌ కాడా, కేటీఆర్‌ అన్న.. నేను నా బలగం టీమ్‌ తోటి మా సైన్మా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నాము. అందరూ తప్పకుండా రావాలి మరి, దూమ్‌ ధామ్‌ చేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. గ్రామాల్లోని మనషులు, కుటుంబాల మధ్య సంబంధాలు, కోపతాపాలను ట్రైలర్‌లో చూపించారు. ప్రియదర్శి పెళ్లి కష్టాలను కూడా కామెడీ మిక్స్ చేసి చూపించగా.. భీమ్స్ సిసిరోలియే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ గమనిస్తే అచ్చమైన తెలంగాణ సంస్కృతిని చూపించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.