AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vedam Movie: ‘వేదం’ సినిమాలో మనోజ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..

2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్‏గా ఇమేజ్ సంపాదించుకున్న అనుష్క ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేశారు.

Vedam Movie: 'వేదం' సినిమాలో మనోజ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..
Vedam Movie
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2023 | 9:15 AM

Share

వెండితెరపై ఎంతోమంది హీరోయిన్స్ సందడి చేసి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. మరికొందరు ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. కానీ ప్రేక్షకుల మనసులలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో వేదం సినిమా హీరోయిన్ ఒకరు. 2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ముఖ్యంగా అప్పటికే స్టార్ హీరోయిన్‏గా ఇమేజ్ సంపాదించుకున్న అనుష్క ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేశారు.

ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. అల్లు అర్జున్ పక్కన దీక్షా సేథ్.. మనోజ్ పక్కన లేఖా వాషింగ్టన్ నటించారు. దీక్షా సేథ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ లేఖా వేదం సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఈ సినిమా తర్వాత కమినా… డైనమైట్ సినిమాల్లో చిన్న పాత్రలలో నటించింది. కానీ ఇవేమి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

ఇవి కూడా చదవండి

లేఖా చెన్నైలో నాటక కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో జయమకొండాన్ అనే తమిళ సినిమాలో సహాయనటిగా కెరీర్ ప్రారంభించింది లేఖా. ఆ తరువాత ఆమె మల్టీస్టారర్ సినిమాలైన వేదం, వా ల్లో నటించింది. ప్రస్తుతం ఆమె అజ్జీ అనే ప్రొడక్ట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన మాతృ కి బిజిలీ కా మండోలా చిత్రంలో లేఖా వాషింగ్టన్ అతిథి పాత్రలో కనిపించారు. సినిమాల్లో అంతగా కనిపించని లేఖా.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!