Adipurush: ‘ఆదిపురుష్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పించేలా ‘జైశ్రీరామ్’ సాంగ్..
రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులకు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై దర్శకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులకు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై దర్శకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీఎఫ్ఎక్స్ మార్చే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ వార్తలు వినిపించాయి. ఈ సాంగ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కాసేపటి క్రితం ఈసినిమా నుంచి మొదటి పాట అప్డేట్ రివీల్ చేశారు. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ చిన్న బిట్ ను విడుదల చేశారు.




“నీ సాయం.. సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్య.. మా బలమేదంటే నీపై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే.. మహిమాన్విత మంత్రం నీ నామం.. జైశ్రీరాం.. జైశ్రీరాం..” అంటూ సాగుతుంది. ఈ సాంగ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అజయ్.. అతుల్ సంగీతం అందించారు. జైశ్రీరామ్ అంటూ సాగే ట్యూన్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీఎఫ్ఎక్స్ పక్కనపెడితే ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
జై శ్రీరామ్ ?
If you can’t visit the Char Dhaam, Just chant the name of Prabhu Shri Ram. Jai Shri Ram ??#JaiShriRam lyrical motion poster out now!
Telugu: https://t.co/NRBMx9OZKK Hindi: https://t.co/RB0fiFcNyG#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon pic.twitter.com/p2fHjum7AZ
— UV Creations (@UV_Creations) April 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.