Director Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఓవైపు చిరు.. మరోవైపు బాలకృష్ణ ఫోటోస్.. ఎందుకంటే..

అయితే గతంలో సుకుమార్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. సుక్కు ఇంట్లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఫోటోస్ ఉంటాయట. అందుకు పెద్ద కారణమే ఉందట.

Director Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఓవైపు చిరు.. మరోవైపు బాలకృష్ణ ఫోటోస్.. ఎందుకంటే..
Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2023 | 8:08 AM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన జంటగా.. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ కంటే.. సెకండ్ పార్ట్ కోసం సుక్కు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే గతంలో సుకుమార్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. సుక్కు ఇంట్లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఫోటోస్ ఉంటాయట. అందుకు పెద్ద కారణమే ఉందట.

సుకుమార్ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారట. అందులో పెద్దన్నయ్య బాలయ్య ఫ్యాన్ కాగా.. రెండు, మూడవ అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్ అంట. పెద్దన్నయ్యకు ఇష్టం కాబట్టి బాలయ్య ఫోటో ఓవైపు..మిగతా ఇద్దరు అన్నయ్యల కోసం మరోవైపు చిరంజీవి ఫోటో ఉంటుందట. ఇక వీరిద్దరిలో ఎవరీ సినిమా రిలీజ్ అయిన ఆరోజు ఇంట్లో పెద్ద కోలాహలమేనట. ఇదే విషయాన్ని గతంలో బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో చెప్పారు సుకుమార్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇందులో బన్నీ పూర్తిగా సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.