Geethanjali: నాగార్జున సూపర్ హిట్ గీతాంజలి హీరోయిన్ ఎలా మారిందో చూశారా ?.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
జాతీయ స్థాయిలో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా నేషనల్ అవార్డ్ అందుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున 7 నంది అవార్డ్స్ కైవసం చేసుకుంది.ఇప్పటికీ ఈ సినిమా అంటే ఇష్టపడని యూత్ ఉండరు. అయితే ఈ సినిమాలో సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ గిరిజా.

గీతాంజలి.. అప్పట్లో ప్రేమకథల్లో ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది. అంతేకాకుండా.. అక్కినేని నాగార్జున ఫిల్మ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అదే. ఇందులో నాగార్జున జోడిగా గిరిజా శెట్టార్ నటించారు. 1989 మే 19న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలోనూ అత్యథిక కలెక్షన్స్ రాబట్టింది. జాతీయ స్థాయిలో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా నేషనల్ అవార్డ్ అందుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున 7 నంది అవార్డ్స్ కైవసం చేసుకుంది.ఇప్పటికీ ఈ సినిమా అంటే ఇష్టపడని యూత్ ఉండరు. అయితే ఈ సినిమాలో సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ గిరిజా.
తొలి సినిమాతోనే ఎంతో స్టా్ర్ డమ్ కొట్టెసిన ఈ అలనాటి హీరోయిన్.. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కొన్ని మలయాళ సినిమాలు చేసినా.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది. కళ్లతోనే అందరినీ కట్టిపడేసిన ఆమె.. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా ? .. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటుంది. రచయితగా రాణిస్తోంది. అంతేకాకుండా.. 2005 నుంచి ఆరోగ్యం, మానవ సంబంధాలపై ఫ్రీలాన్స్ విలేకరిగానూ పనిచేస్తోంది.
అయితే ఈమెకు గీతాంజలి ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా ?. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి వెళ్లిందట. అక్కడే గిరిజను చూసిన మణిరత్నం గీతాంజలి ఆఫర్ ఇచ్చాడని.. దీంతో ఆమె వెంటనే ఓకె చెప్పినట్లుగా సమాచారం. అయితే గిరిజా ఇప్పుడు మళ్లి తెరపై సందడి చేసేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. రక్షిత్ శెట్టి.. పరంవా స్టూడియోస్ నిర్మిస్తున్న ఇబ్బని తబ్బిట ఇలేయాలి చిత్రంలో గిరిజా కీలకపాత్రల నటించనున్నారని తెలుస్తోంది. దీంతో మరోసారి ఆ అందాల రాశిని తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.





Girija
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.