Samantha: ‘ప్లీజ్ సామ్.. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి’.. నెటిజన్ రిక్వెస్ట్‏కు సమంత కౌంటర్ వేరేలెవల్..

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్. ఇందులో శకుంతల పాత్రలో సామ్ నటించగా.. దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్.

Samantha: 'ప్లీజ్ సామ్.. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి'.. నెటిజన్ రిక్వెస్ట్‏కు సమంత కౌంటర్ వేరేలెవల్..
Samantha
Follow us

|

Updated on: Mar 27, 2023 | 9:31 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్. ఇందులో శకుంతల పాత్రలో సామ్ నటించగా.. దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ తన భూజాన వేసుకుని వరుస ఇంటర్వ్యూలతో ముందుకెళ్తున్నారు సామ్. ఈ క్రమంలో ఇప్పటికే తన ఆరోగ్య పరిస్థితి.. తదుపరి ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అయితే తాజాగా ఓ నెటిజన్ సామ్ ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు . ఇది చూసిన సామ్ అతడికి ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. “నాకు తెలుసు అది నా స్థానం కాదని.. కానీ ప్లీజ్ ఎవరితోనైనా మీరు డేటింగ్ చేయండి” అంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేయగా.. సామ్ స్పందిస్తూ.. “మీలాగే నన్ను ఎవరు ప్రేమిస్తారు” అంటూ హార్డ్ సింబల్ షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం చిత్రంలో మధుబాల, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించగా.. ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయబోతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం సామ్ చేతిలో సిటాడెల్, ఖుషి చిత్రాలున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని