AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘బలగం’.. ట్రెండింగ్‏లోనూ టాప్..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రతి ప్రేక్షకుడిని ఎమోషనల్ గా టచ్ చేసిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అటు బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చింది.

Balagam Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న 'బలగం'.. ట్రెండింగ్‏లోనూ టాప్..
Balagam
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2023 | 11:00 AM

Share

స్టార్ హీరోహీరోయిన్స్ కాకుండా..కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ చేస్తుందని మరోసారి నిరూపించింది బలగం చిత్రం. తెలుగు తెరపై కమెడియన్‏గా అలరించిన వేణు యెల్దండి రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రతి ప్రేక్షకుడిని ఎమోషనల్ గా టచ్ చేసిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అటు బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చింది.

థియేటర్లలో రిలీజ్ అయి నెల తిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది బలగం చిత్రం. ఓవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలోనూ భారీగానే వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. బలగం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 24 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 10.37 కోట్లు షేర్ రాబట్టింది. ఇప్పటివరకు ఈసినిమా రూ.9.17 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఓటీటీలోనూ దూసుకుపోతుంది బలగం చిత్రం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫాంలో టాప్ 2 ట్రెండింగ్ లో ఉంది. అంతేకాకుండా.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటుంది ఈ చిత్రం. ఈ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు వేణు యెల్దండి. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు