AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..

సినిమా హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొంతమంది రిలేషన్స్ షిప్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ హీరోయిన్ రూట్ సపరేట్.. టీవీ షోలతో పాపులర్ అయ్యింది ఈ చిన్నది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో డేటింగ్ చేస్తుంది ఈ అమ్మడు.

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2025 | 12:50 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. అలాగే కొంతమంది లవ్ ఎఫైర్స్ తో నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నారు. మరికొంతమంది పెళ్లి అనే టాపిక్ ఎత్తకుండా ఉంటున్నారు. ఇక హీరోయిన్స్ సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాగే వివాదల్లోనూ చాలా మంది హీరోయిన్స్ చిక్కుకుంటుంటారు. హీరోయిన్స్ చాలా మంది వయసులో తమకంటే చాలా పెద్ద వారితో డేటింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకరు. ఈ చిన్నది ఇప్పుడు 40 ఏళ్ల హీరోతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు కాంట్రవర్సీల్లోనూ ఈ అమ్మడు ఎప్పుడూ ముందుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

పైన మనం మాట్లాడుకున్న హీరోయిన్ ఎవరో కాదు.. టెలివిజన్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్. ఈ చిన్నది ఎక్కువగా హిందీ టెలివిజన్ మరాఠీ సినిమాల్లో నటించి పాపులారయ్యింది. ఈ చిన్నది 2021లో  హిందీ బిగ్ బాస్ 15 విజేతగా నిలిచింది. అలాగే పలు టీవీ షోల్లోనూ పాల్గొంది. కాగా 2017లో ఈ చిన్నది నటించిన పెహ్రేదార్ పియా కి సీరియల్ పెద్ద దుమారం రేపింది. ఈ సీరియల్ లో 15 ఏళ్ల వయసున్న ఆమె 9 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంటుంది. దీని వల్ల ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆతర్వాత సీరియల్ ను ఆపేశారు కూడా..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

ఇక బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గొనే సమయంలో టీవీ నటుడు కరణ్ కుంద్రాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అతనితో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నదాని వయసు 32 ఏళ్లు, కరణ్ కుంద్రా వయసు 40ఏళ్లు. తేజస్వీ ప్రకాష్ నట జీవితం 2012లో “2612” అనే థ్రిల్లర్ సీరియల్‌తో ప్రారంభమైంది. ఆమె మరాఠీ సినిమా “మన్ కస్తూరీ రే” (2022)తో సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఫిల్మ్‌ఫేర్ అవార్డు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ.. మరాఠీ కేటగిరీలో నామినేషన్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి