Miss Universe 2025: భారతదేశపు తొలి మిస్ యూనివర్స్.. ఎంత సంపాదించిందో తెలుసా.. ? విజేతలకు ఎంత డబ్బు ఇస్తారంటే..
మిస్ యూనివర్స్ 2025 పోటీలు థాయ్ లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ పోటీలలో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ పోటీలలో గెలిచిన అందాల రాణులకు కేవలం ఫ్రైజ్ మనీ మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి ఇస్తారో తెలుసుకుందామా.

74వ మిస్ యూనివర్స్ పోటీలు థాయ్ లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం జరిగిన పోటీలలో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఈ పోటీలలో గెలిచిన తారలకు ప్రైజ్ మనీతోపాటు జీతం కూడా పొందుతారు. అయితే భారతదేశపు తొలి మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. అప్పట్లో ఆమె ఎంత ప్రైజ్ మనీ, జీతం అందుకున్నారో తెలుసుకుందామా. సుష్మితా సేన్.. మే 21, 1994న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత లారా దత్తా 2000లో భారతదేశానికి రెండవ మిస్ యూనివర్స్‌గా నిలిచారు.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
1994లో సుష్మితా సేన్ పోటీలో గెలిచినప్పుడు ఆమెకు స్పోర్ట్స్ కారు, లాస్ ఏంజిల్స్ అపార్ట్‌మెంట్‌లో ఏడాది పాటు బస, డిజైనర్ వార్డ్‌రోబ్, బంగారు వజ్రాల ఆభరణాలతో సహా మిగతా ప్రైజ్ మనీ లభించాయి. ఆమెకు మోడలింగ్ కాంట్రాక్ట్ కూడా లభించింది. మిస్ యూనివర్స్ గెలిచిన అందాల రాణికి ప్రైజ్ మనీ మాత్రమే లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. మిస్ యూనివర్స్ 2025 బహుమతి డబ్బు.. రూ. 19,959,300, నెలకు రూ.44,35,477. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తన విజేతలకు బహుమతి డబ్బుతో పాటు జీతం ఎందుకు చెల్లిస్తుంది? ఒక సంవత్సరం పాటు వారి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. అలాగే ఈవెంట్, ఇంటర్వ్యూలు, ఫోటూషూట్స్, ప్రచారాలలో పాల్గొంటుంది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
సుష్మితా సేన్ నవంబర్ 19, 1975న జన్మించారు. 1996లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన ‘దస్తక్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె వద్ద BMW 7 సిరీస్ 730 LD, లెక్సస్ LX 470, BMW X6, ఆడి Q వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం సుష్మితా సేన్ 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..




