Telangana Shakuntala: తెలంగాణ శకుంతల జీవితంలోనే ఎన్నో విషాదాలు.. పడిలేచిన కెరటం ఆమె..
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన శకుంతల అసలు పేరు కడియాల శకుంతల. తెలుగులో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలంగాణ యాస.. రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
“నీ తల్లి.. ఇంకోపాలి నా ఇలాకలో ప్రేమ అనే మాట వినబడాలే..” అనే డైలాగ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెలంగాణ శకుంతల. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన శకుంతల అసలు పేరు కడియాల శకుంతల. తెలుగులో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలంగాణ యాస.. రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సినిమాలో విలక్షణ పాత్రలతో మెప్పించిన ఆమె.. 2014 జూన్ 14న గుండెపోటుతో అకాల మరణం చెందారు. శకుంతల మృతి తెలుగు చిత్రపరిశ్రమలో తీరని లోటు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఎప్పుడూ డేరింగ్ అండ్ డాషింగ్ మహిళగా కనిపించే ఆమె కుటుంబం కోసం పడిన కష్టాలు.. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్స్.. ఎన్నో కష్టాలను ఎదురెళ్లి ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. ఆమె ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం.
1979లో డైరెక్టర్ గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన మా భూమి సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తేజ తెరకెక్కించిన నువ్వు నేను సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలో ఆమె నటనకు.. డైలాగ్స్ కు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేవలం విలన్ గా మాత్రమే కాదు..సీరియస్ లుక్కులోనూ కామెడీతో ఆడియన్స్ ను నవ్వించారు. లక్ష్మి సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ తో కలిసి ఆమె చేసిన కామెడీ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు.
ఆమె నటన.. పాత్రను ఆమె ప్రదర్శించే తీరు అద్భుతమనే చెప్పాలి. తెలుగు తెరపై పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించారు. అయితే నటిగా ప్రేక్షకులను అలరించిన ఆమె జీవితంలో అంతులేని కష్టాలు. చిన్నవయసులోనే తండ్రి చనిపోవడంతో.. నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తర్వాతే ఆమె పెళ్ళి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్స్ జరిగాయి. ఓ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. దీంతో ఆమె నటించలేనేమో అని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఆమె కోలుకొని పలు చిత్రాల్లో నటించారు. 2014 జూన్ 14న ఉదయం మూడు గంటల సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. శకుంతలం మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని లోటు.