AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. 250పైగా సినిమాలు.. 144 చిత్రాల్లో ఒకే పాత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్..

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో సహయ నటీనటులకు సైతం మంచి క్రేజ్ ఉంటుంది.మీకు తెలుసా.. ఒక నటుడు ఏకంగా 250కి పైగ సినిమాల్లో నటించాడు. అంతేకాదు.. 144 సినిమాల్లో ఒక పాత్ర పోషించి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..?

Tollywood: ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. 250పైగా సినిమాలు.. 144 చిత్రాల్లో ఒకే పాత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
Jagdish Raj Khurana
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 10:12 AM

Share

భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినీప్రియులకు దగ్గరయ్యారు. ప్రతి చిత్రంలో వైవిధ్యమైన పాత్ర పోషించి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అయితే కొన్నిసార్లు ఒకరకమైన పాత్రలు రావడం అనేది నటులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య. మరికొందరు ప్రతి సినిమాకు కొత్త పాత్రను పొందుతారు. కానీ ఒక నటుడు మాత్రం 250కి పైగా సినిమాల్లో నటించారు. కానీ 144 సినిమాల్లో కేవలం పోలీసు పాత్రను మాత్రమే పోషించారు. అవును.. పలు సినిమాల్లో వేరు వేరు పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నారు. కానీ ఆయన యూనిఫాం ధరించినప్పుడు ఆయన యాక్టింగ్ మాత్రం జనాల హృదయాల్లో నిలిచిపోయింది. బలమైన నటన కారణంగానే ఆయనకు అలాంటి పాత్రలు మళ్లీ మళ్లీ వచ్చాయి. దీంతో ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఆయన మరెవరో కాదు.. జగదీష్ రాజ్ ఖురానా.

1928లో జన్మించిన జగదీష్ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1955లో సీమా అనే సినిమాలో డాక్టర్ పాత్రలో నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దీవార్, డాన్, శక్తి వంటి చిత్రాల్లో ఎక్కువగా పోలీస్ పాత్రలు పోషించారు. జగదీష్ తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషించకపోయినా, సినిమాల్లో పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. పోలీసుగా నటించడమే కాకుండా, కటి పతంగ్ వంటి చిత్రాలలో కూడా ఆయన ఇతర పాత్రలు పోషించారు. దాదాపు 144 సినిమాల్లో కేవలం పోలీస్ పాత్రలే పోషించారు.

జగదీష్ రాజేష్ ఖురానాకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన జోరు కా గులాం, ది ట్రైన్, ఖామోషి వంటి చిత్రాల్లో నటించారు. 1950ల నుండి 2000ల వరకు 250కి పైగా సినిమాల్లో నటించారు. మొదట CID చిత్రంలో పోలీసు పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో మొదటి 15 సంవత్సరాలు ఎక్కువగా పోలీసు అధికారుల పాత్రలను పోషించాడు.

Jagdish Raj Khurana. News

Jagdish Raj Khurana. News

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..