Tollywood: ఒకప్పుడు వీధిలో గుడ్లు అమ్మిన వ్యక్తి.. అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటుడు.. ఎవరంటే..
భారతీయ సినీపరిశ్రమలో హాస్యనటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో కోట్లాది మంది జనాల హృదయాలను గెలుచుకున్న ఆయన.. ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్. అంతేకాదు.. అతడు దేశంలోనే సంపన్న నటుడు కూడా. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

భారతీయ సినీపరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్స్ చాలా మంది ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళం భాషలలోని అగ్రహీరోలు అందరూ ఒక్కో సినిమాకు కోట్లు తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ ఒక్కో చిత్రానికి రూ.150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు వారంతా బాక్సాఫీస్ వద్ద ఆదిపత్యం చేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు వీధిలో గుడ్లు అమ్ముకున్న వ్యక్తి.. ఇండస్ట్రీని శాసించాడని. అవును.. గుడ్లు అమ్ముకుంటూ జీవనం సాగించిన అతడు.. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1960లలో అతడు భారతదేశంలోనే ఫేమస్ కమెడియన్.. అలాగే ధనవంతుడైన నటుడు కూడా. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? బాంబే టాకీస్ చిత్రంలో డ్యాన్సర్, నటుడు ముంతాజ్ అలీ కుమారుడు మెహమూద్.
చిన్నప్పుడు అతడి కుటుంబం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది. అతడి తండ్రి మద్యానికి బానిస కావడంతో చిన్నప్పుడే మెహమూద్ వివిధ ఉద్యోగాలు చేశారు. డ్రైవర్ గా పనిచేయడమే కాకుండా వీధిలో గుడ్లు అమ్మేవాడు. గుర్రపు స్వారీ శిక్షణ ఇవ్వడం.. టెన్నిస్ కోచ్ గా పనిచేశాడు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి జూనియర్ ఆర్టిస్టుగా పనిచేశారు. 1950లో సహాయక పాత్రలలో నటించి హాస్య నటుడిగా తన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పటోసన్, బూత్ బంగ్లా, బాంబే టు గోవా వంటి చిత్రాల్లో నటించారు.
అతడు తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు. ఆ సమయంలో మెహమూద్ రెండు వారాల అతిథి పాత్రకు రూ. 7.5 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. 1996లో అతడు దర్శకత్వం వహించిన చివరి చిత్రం దుష్మన్ దునియా కాను సినిమా విడుదలైంది. 2004లో మెహమూద్ మరణించారు. అప్పట్లోనే ఇండస్ట్రీని శాసించిన హాస్యనటుడు అతడు.

Comedian Mohamood.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..




