- Telugu News Photo Gallery Cinema photos Global star Ram Charan lineup is raising expectations, which one comes first?
Ram Charan: అంచనాలు పెంచేస్తున్న గ్లోబల్ స్టార్ లైనప్… ఏది ముందు..?
గేమ్ చేంజర్ రిజల్ట్ తరువాత ఫీల్ అవుతున్న మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి అప్‌డేట్స్. ప్రజెంట్ పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ హింట్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న సుకుమార్ సినిమా ఆన్ కార్ట్స్ అన్న క్లారిటీ ఇచ్చేశారు. రంగస్థలాన్ని మించి ఆ సినిమా ఉంటుందన్నది సుకుమార్ ఇస్తున్న హామీ.
Updated on: Jun 15, 2025 | 3:10 PM

ఆ మధ్య సుకుమార్ ప్రాజెక్ట్ విషయంలో డౌట్స్ రెయిజ్ అయినా... రీసెంట్‌గా క్లారిటీ వచ్చింది. ప్రజెంట్ నేను చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నా అంటూ అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు లెక్కలు మాస్టర్. దీంతో చరణ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ సుకుమార్ తోనే అన్న నిర్ణయానికి వచ్చేశారు ఫ్యాన్స్.

కానీ సడన్‌గా చరణ్ లైనప్‌లో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు చరణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఆ మూవీస్ విషయంలో ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో క్రేజీ నేమ్ తెర మీదకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. అయితే అల్లు అర్జున్ సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు త్రివిక్రమ్. కానీ సడన్‌గా బన్నీ లైనప్ మారటంతో గురూజీ నెక్ట్స్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ టైమ్‌లో గురుజితో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ ఇద్దరు హీరోల కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఎవరు ముందు ఫ్రీ అయితే ఆ హీరోతో సినిమాను చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ముందు రామ్ చరణే ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చరణ్ పెద్ద షూట్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు. మరి చరణ్ నెక్ట్స్ మూవీ గురూజీతోనే చేస్తారా..? లేక మరో దర్శకుడిని ట్రై చేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.




