- Telugu News Photo Gallery Cinema photos Balakrishna vs Pawan Kalyan Dussehra war, who benefits and who loses?
Dasara Movies: బాలయ్య vs పవన్.. దసరా వార్… ఎవరికి లాభం.. ఎవరికీ నష్టం.?
టాలీవుడ్ స్క్రీన్ మీద మరో బిగ్ క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల పెద్ద పండుగ దసరా సందర్భంగా ఇద్దరు టాప్ హీరోలు బరిలో దిగేందుకు సై అంటున్నారు. సీక్వెల్‌తో వస్తున్న బాలయ్య, వింటేజ్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే డేట్ మీద ఫోకస్ చేస్తున్నారు. దీంతో దసరా ఫైట్ ఆసక్తికరంగా మారింది.
Updated on: Jun 15, 2025 | 2:46 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ యాక్షన్ డ్రామా అఖండ 2 తాండవం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాంబినేషన్‌లో గతంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ రావటంతో నాలుగో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్టుగా బాలయ్యను మరింత పవర్‌ఫుల్ అఘోరగా చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే కాన్ఫిడెంట్‌గా దసరా బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ కూడా యూనిట్‌లో జోష్ నింపింది.

ఇక మోస్ట్ అవెయిటెడ్ పవర్ స్టార్ మూవీ ఓజీ కూడా దసరా బరిలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్ ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వింటేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

భారీ అంచనాలు ఉన్న రెండు సినిమాలు ఒకే టైమ్‌లో రిలీజ్ అవుతాయన్న వార్తలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెర తీశాయి. నిజంగానే ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌కు వస్తే ఆ ఫైట్ ఎలా ఉంటుంది? థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారు.? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే దసరా లాంటి సీజన్‌లో రెండు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది. అందుకే ఈ మూవీస్ ఒకే టైమ్‌లో వచ్చినా.. పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న వర్షన్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




