Dil Movie : దిల్ సినిమాలో నటించిన ఈ ఐదుగురు నటులు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు
సై సినిమాతర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు నితిన్. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. కాగా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో రంగ్ దే కాస్త పర్లేదు అనిపించుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. సై సినిమాతర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు నితిన్. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. కాగా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో రంగ్ దే కాస్త పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్. ఇక నితిన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దిల్ సినిమా ఒకటి. దిల్ సినిమాతో నితిన్ మాస్ ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు పరిచయం అయ్యారు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?
వివివినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నేహా నటించింది. అయితే ఈ సినిమాలో నటించిన ఐదుగురు ప్రముఖ నటులు కన్నుమూశారని మీకు తెలుసా.? దిల్ సినిమాలో నటించిన దిగ్గజ నటులు ఐదుగురు కన్నుమూశారు. వారు ఎవరో ఒక్కసారి చూద్దాం.!
ఇది కూడా చదవండి :Meera Jasmine: అచ్చం మీరాజాస్మిన్‌లా ఉండే మరో నటి.. ఆమె ఎవరో తెలుసా..?
దిల్ సినిమాలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎమ్ ఎస్ నారాయణ. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించిన ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో మరణించారు. అలాగే దిల్ సినిమాలో నితిన్ తండ్రిగా నటించిన చలపతిరావు గుండెపోటుతో మరణించారు. అలాగే నితిన్ కు మావయ్యగా నటించిన ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దిల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కూడా 57 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అదేవిధంగా సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించినటువంటి రాజన్ పి దేవ్ కూడా అనారోగ్యంతో కనుమూశారు.
ఇది కూడా చదవండి : Bigg Boss 8: పెద్ద ప్లానే ఇది..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.