Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7ను హుషారుగా మొదలు పెట్టారు కింగ్ నాగార్జున. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే 14 మంచి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు నాగార్జున. హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్, శుభ శ్రీ, శోభా శెట్టి, రతిక, ఆట సందీప్, అమర్ దీప్ , గౌతమ్ కృష్ణ, షకీలా, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, హీరో శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

బిగ్ బాస్ సీజన్ సెవన్ సందడి మాములుగా లేదు. గత సీజన్స్ కు మించేలా ఈ సీజన్ ను ప్లాన్ చేశారు టీమ్. బిగ్ బాస్ సీజన్ 7 కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7ను హుషారుగా మొదలు పెట్టారు కింగ్ నాగార్జున. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే 14 మంచి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు నాగార్జున. హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్, శుభ శ్రీ, శోభా శెట్టి, రతిక, ఆట సందీప్, అమర్ దీప్ , గౌతమ్ కృష్ణ, షకీలా, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, హీరో శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.
యూట్యూబర్ గా పల్లవి ప్రశాంత్ పాపులర్. ఆయన సోషల్ మీడియా వేదికగా తాను రైతు బిడ్డనని, బిగ్ బాస్ కు వెళ్లడం తన కల అంటూ చెప్తూ ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో బిగ్ బాస్ కు వెళ్లేందుకు సపోర్ట్ చేయాలనీ చాలా కాలం నుంచి ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి మనోడు అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ సీజన్ సెవన్ లోకి సక్సెస్ ఫుల్ గా అడుగు పెట్టాడు.
View this post on Instagram
ఇక పై తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తూనే ఓ బియ్యం మూటతో వచ్చి అవి తాను పండించిన బియ్యం అని తెలిపాడు. అవి నాగ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ వారానికి లక్ష రూపాయలు ఉందంట. ఆయన ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని లక్షలు వస్తాయన్నమాట. మరి పల్లవి ప్రశాంత్ ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



