- Telugu News Photo Gallery Cinema photos Kannada Hero Yash As face of kannada Movies next place gest rishab shetty With kanthara Movie Telugu Entertainment Photos
Yash – Rishab shetty: కన్నడ పేస్ ఆఫ్ గా యాష్..! కాంతారా తో రిషబ్ తరువాతి స్థానం.
కేజీఎఫ్ సక్సెస్ తరువాత ఫేస్ ఆఫ్ కన్నడ సినిమాగా మారారు యష్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని నార్త్ మేకర్స్ కూడా కేజీఎఫ్ సక్సెస్ తరువాత సాండల్‌వుడ్‌ను సీరియస్‌గా తీసుకోవటం స్టార్ట్ చేశారు.నిన్న మొన్నటి వరకు కన్నడ సినిమా జోరుకు యషే కారణం అన్న టాక్ వినిపించింది. అయితే ఇమేజ్ యష్ ఖాతాలో ఎక్కువ రోజులు ఉంటుందా... అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి.
Updated on: Sep 05, 2023 | 1:13 PM

కేజీఎఫ్ సక్సెస్ తరువాత ఫేస్ ఆఫ్ కన్నడ సినిమాగా మారారు యష్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకోని నార్త్ మేకర్స్ కూడా కేజీఎఫ్ సక్సెస్ తరువాత సాండల్‌వుడ్‌ను సీరియస్‌గా తీసుకోవటం స్టార్ట్ చేశారు.

నిన్న మొన్నటి వరకు కన్నడ సినిమా జోరుకు యషే కారణం అన్న టాక్ వినిపించింది. అయితే ఇమేజ్ యష్ ఖాతాలో ఎక్కువ రోజులు ఉంటుందా... అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి.

ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ సినిమా కేజీఎఫ్. ఇన్నాళ్లు మా సినిమా మా ఆడియన్స్ అంటూ మడి కట్టుక్కూర్చున్న కన్నడ పరిశ్రమ కేజీఎఫ్‌తో రీజినల్ బారియర్స్ దాటి బయటకు వచ్చింది.

తొలి అడుగులోనే నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది సాండల్‌వుడ్. దీంతో ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సరసన చేరారు ఈ కన్నడ హీరో.

కేజీఎఫ్ సక్సెస్ తరువాత కన్నడ నాట యష్షే నెంబర్ వన్ అన్న టాక్ వినిపించింది. నేషనల్ ఇమేజ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ అవ్వటంతో యష్‌ను ఫేస్ ఆఫ్ కన్నడ సినిమాగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. కానీ షార్ట్ గ్యాప్‌లోనే ఈ ఇమేజ్‌కు థ్రెట్ ఏర్పడింది.

కేజీఎఫ్ తరువాత నేషనల్‌లో ట్రెండ్ అయిన మరో సినిమా కాంతార. కన్నడ ఇండస్ట్రీ నుంచే వచ్చిన ఈ చిన్న సినిమా ఇండియా స్క్రీన్ మీద సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా నటుడిగా దర్శకుడిగా రిషబ్ శెట్టి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ బజ్ యష్ ఫ్యాన్స్‌లో టెన్షన్ క్రియేట్ చేసింది. దీనికి తోడు యష్ ఖాళీగా ఉన్న టైమ్‌లోనే కాంతార 2ని లైన్‌లో పెట్టేస్తున్నారు రిషబ్.

కేజీఎఫ్ తరువాత నెక్ట్స్ మూవీని ఇంత వరకు కన్ఫార్మ్ చేయలేదు యష్. కానీ రిషబ్ మాత్రం ఆల్రెడీ కాంతర 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. దీంతో కాంతార 2 ఆడియన్స్ ముందుకు వస్తే యష్‌ను రిషబ్ క్రాస్ చేస్తారని ఫీల్ అవుతున్నారు సినీ జనాలు.




