- Telugu News Photo Gallery Cinema photos Do you know the price of the saree worn by Rashmika Mandanna.. It is around 35 thousand
Rashmika Mandanna: రష్మిక చీర చూడడానికి సింపుల్‌గానే ఉన్న.. ధర మాత్రం దిమ్మతిరిగేలా ఉందిగా..
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో ముందు వరసలో ఉన్నారు రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక. ఆతర్వాత గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నెక్కెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యింది.
Updated on: Sep 05, 2023 | 11:52 AM

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో ముందు వరసలో ఉన్నారు రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక.

ఆతర్వాత గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నెక్కెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యింది.

ఈ మూవీ తర్వాత రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది రష్మిక మందన్న. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. ఇటీవలే అక్కడ దళపతి విజయ్ తో కలిసి సినిమా చేసింది. అలాగే హిందీ భాషలోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. కానీ హిందీలో ఈ అమ్మడికి లాక్ అంతగా కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

తాజాగా రష్మిక తన అసిస్టెంట్ పెళ్ళికి హాజరయ్యింది. రష్మిక రావడంతో ఆనందపడ్డ ఆ దంపతులు రష్మిక కళ్ళకు నమస్కరించారు. అయితే ఈ పెళ్లికి రష్మిక చీరలో హాజరయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు చీర ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ చీర ధర సుమారు 35 వేలు ఉంటుందని తెలుస్తోంది.




