AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ఆ హీరో స్థానంలోకి ప్రభాస్ ఎలా వచ్చాడు ?.. రాధేశ్యామ్ సినిమాకు ముందు అనుకున్న స్టార్ ఎవరంటే..

2022లో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఎప్పుడూ మాస్ అండ్ యాక్షన్ హీరోగా.. లవర్ బాయ్ గా ప్రభాస్ ను చూసిన అడియన్స్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఓన్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ మూవీకి కలెక్షన్స్ తగ్గిపోయి.. భారీ నష్టం ఏర్పడింది. లవ్ స్టోరీ అంటూ వచ్చిన రాధే శ్యామ్ మూవీలో అసలు స్క్రిప్ట్‌లో ప్రేమ కథ లేదు. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్ర కోసం ముందుగా అనుకున్నది ప్రభాస్ ను కాదు. మరీ ఈ సినిమాను మిస్

Radhe Shyam: ఆ హీరో స్థానంలోకి ప్రభాస్ ఎలా వచ్చాడు ?.. రాధేశ్యామ్ సినిమాకు ముందు అనుకున్న స్టార్ ఎవరంటే..
Radhe Shyam
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2023 | 5:50 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందమైన ప్రేమకథగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2022లో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఎప్పుడూ మాస్ అండ్ యాక్షన్ హీరోగా.. లవర్ బాయ్ గా ప్రభాస్ ను చూసిన అడియన్స్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఓన్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ మూవీకి కలెక్షన్స్ తగ్గిపోయి.. భారీ నష్టం ఏర్పడింది. లవ్ స్టోరీ అంటూ వచ్చిన రాధే శ్యామ్ మూవీలో అసలు స్క్రిప్ట్‌లో ప్రేమ కథ లేదు. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్ర కోసం ముందుగా అనుకున్నది ప్రభాస్ ను కాదు. మరీ ఈ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసుకుందామా.

ఈ చిత్రానికి ప్రభాస్ మొదటి ఎంపిక కాదు. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇందులో ప్రభాస్ పాత్ర కోసం ముందుగా అనుకున్నది దగ్గుబాటి వెంకటేష్. మొదట్లో స్క్రీన్‌ప్లే అందుకున్నప్పుడు, అది ప్రేమకథ లేదా మరేదైనా ఇతివృత్తం లేకుండా కేవలం హస్తసాముద్రికానికి సంబంధించిన కథనం మాత్రమే. కానీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో వెంకీ ఈ సినిమాను తిరస్కరించాడట. దీంతో ఈ సినిమా కథను కొత్తగా మార్చి ప్రభాస్‌కి వినిపించాడు డైరెక్టర్ రాధా కృష్ణ. ఇక ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హస్తసాముద్రికుడైన విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

రాధే శ్యామ్ హస్తసాముద్రిక శాస్త్రాన్ని ఉపయోగించి ఓ ప్రేమకథను తెరపై చూపించాలనుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ గురువుగా కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌కి జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్‌కి మిథూన్, మనన్ భరద్వాజ్, అమల్ మల్లిక్ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్‌కి ఎస్.థమన్, హిందీ వెర్షన్‌కి సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా.. త్వరలోనే సందీప్ వంగా దర్శకత్వంలో రాబోయే సినిమా పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.