AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kick Movie: రవితేజ ‘కిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా? బ్లాక్ బస్టర్ మిస్ అయ్యారుగా

రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో కిక్ ఒకటి. 2009 లో విడుదలైన ఈ చిత్రం మాస్ మహారాజా కెరీర్ లోనే ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు హీరోగా రవితేజ మొదటి ఛాయిస్ కాదట.

Kick Movie: రవితేజ 'కిక్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా? బ్లాక్ బస్టర్ మిస్ అయ్యారుగా
Kick Movie
Basha Shek
|

Updated on: Oct 26, 2025 | 4:27 PM

Share

మాస్ మాహారాజా రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉండవచ్చు. కానీ కిక్ సినిమా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా తర్వాతే రవితేజ మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాబిన్ హుడ్ తరహాలో రవితేజ చేసే దొంగతనాలు, ఇలియానా అంద చందాలు, సురేందర్ రెడ్డి టేకింగ్ కిక్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇక థమన్ అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కికి సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ కథ అందించడం విశేషం. ఇందులో రవితేజ, ఇలియానాతో పాటు తమిళ నటుడు శ్యామ్, బ్రహ్మానందం, జయ ప్రకాశ్ రెడ్డి, అలీ, షయాజీ షిండే, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, రఘు బాబు, నదియా ఇలా చాలామందే నటించారు. రవితేజతో పాటు సురేందర్ రెడ్డికి మంచి బ్రేక్ అందించిన కిక్ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే అసలు వదిలిపెట్టరు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి హీరోగా రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట.

ఇవి కూడా చదవండి

కిక్ సినిమాలో హీరో కోసం మొదట ప్రభాస్ ను సంప్రదించారట మేకర్స్. అయితే అప్పటికే అతని సినిమా డైరీ ఫుల్ అవ్వడంతో తప్పుకున్నాడట. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కు వినిపించాడట. అయితే అంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన అశోక్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీకి కూడా వక్కంతం వంశీనే కథను అందించాడు. దీంతో కిక్ సినిమా చేయడానికి ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు అప్పటికే తారక్ చేతిలో చాలా సినిమాలు ఉండంతో కిక్ సినిమాను వదిలేసుకున్నాడు.

ఫౌజి సినిమాలో ప్రభాస్..

ఇక చివరికి సురేందర్ రెడ్డి కిక్ సినిమా స్టోరీని రవితేజకు వినిపించాడ. అతను వెంటనే ఒకే చెప్పడంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ పట్టాలెక్కిందట. మొత్తానికి ప్రభాస్, ఎన్టీఆర్ లు కాదనుకన్న సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?