Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PremaKatha Chitram: సినిమాలకు దూరంగా ప్రేమకథ చిత్రం హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఒక్క హిట్ ఒక్కటంటే ఒకే ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూసే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు సుదీర్ బాబు.. ఈ యంగ్ హీరో నటించిన ప్రేమకథ చిత్రం గుర్తుందా.?

PremaKatha Chitram: సినిమాలకు దూరంగా ప్రేమకథ చిత్రం హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Premakatha Chitram
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 10:17 AM

Share

ఒక్క హిట్ ఒక్కటంటే ఒకే ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూసే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి రెండు మూడు సినిమాలు తగ్గకుండా రిలీజ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. కానీ ఈ యంగ్ హీరోకు ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇక సుధీర్ బాబు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా అంటే టక్కున చెప్పే పేరు ప్రేమకథ చిత్రం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు.

అలాగే ప్రేమకథ చిత్రం సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ నందిత తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నందిత అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఎంతో మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత నందిత పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఇవి కూడా చదవండి

నిజానికి తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాలు చేసింది. మరోసారి సుధీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆతర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడ కనిపించడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో