జిమ్‌కు వెళ్లకుండా బరువు తగ్గిన స్టార్ హీరోయిన్.. ఇలా చేస్తే చాలట టక్కున స్లిమ్ అవుతారట..
సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఈ కారణంగానే వారు ప్రతిరోజూ జిమ్‌లో కఠిన వ్యాయామాలు, వర్కవుట్లు చేస్తారు. ఆహారంపై కూడా నియంత్రణ పాటిస్తూ నోరు కట్టేసుకుంటారు. అయితే అన్ని వేళలా ఇవి సాధ్యం కాకపోవచ్చు. ఫలితంగా ఉన్నట్లుండి బరువు పెరగుతారు. ముఖ్యంగా నడుము ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది.

హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా.. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ ను నిరాశపరిచిన భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు అప్పుడు క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. ఇక ఫిట్ నెస్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు అందాల భామ సమీరారెడ్డి. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లుక్ మారిపోయింది.. బరువు పెరిగిపోయింది. అయితే జిమ్ కు వెళ్లకుండా బరువు ఎలా తగ్గాలో చెప్పింది. ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చని తెలిపింది. ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గినట్టు ఆమె తెలిపారు. మెట్లు ఎక్కడం అనేది ఒక అద్భుతమైన వ్యాయామం.. ఇంట్లో భుజంపై బ్యాగ్ వేలాడదీసి, వాటర్ బాటిల్ తో లేదా పుస్తకాలతో స్క్వాట్స్ చేయవచ్చని సమీరా రెడ్డి తెలిపింది. ఇంక్లైన్ పుష్-అప్స్‌ను బెడ్ లేదా టేబుల్ సహాయంతో చేయవచ్చని, సైడ్ లంజెస్, సీటెడ్ గుడ్ మార్నింగ్స్, భుజాలను తిప్పడం ఇలా ఇంట్లో ఉండే వర్కౌట్స్ చెయ్యొచ్చు అని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.