Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దైర్యం ఉంటే వేశ్యల దగ్గరకు వెళ్లి అలా చేయండి.. చూద్దాం.! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఈ అందాల భామ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. తన అందంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. ఇప్పుడు దర్శకురాలిగా మారి సినిమాలు చేస్తుంది. అలాగే నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. తాజాగా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దైర్యం ఉంటే వేశ్యల దగ్గరకు వెళ్లి అలా చేయండి.. చూద్దాం.! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2025 | 10:59 AM

Share

సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాదు సహాయక పాత్రలో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడు పేరు పెద్దగా తెలిసుండకపోవచ్చు కానీ.. చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సునీల్ హీరోగా నటించిన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిపోయాయి. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఇంతకూ ఆమె ఎవరంటే..

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె ఎవరో కాదు ఎస్తేర్ నోరోన్హా. సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో ఎస్తేర్ నోరోన్హా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ చిన్నది వేయి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత సునీల్ తో సినిమా చేసింది. బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఈ అమ్మడు. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిపోయాయి. దాంతో ఫెడ్ అవుట్ అయ్యింది. ఇంతలోనే సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

సింగర్ నోయల్ ను ఈ అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎస్తేర్ నోరోన్హా సింగిల్ గా ఉంటుంది. నోయెల్‌తో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్స్ సీన్స్ లోనూ నటించేందుకు సై అంటుంది. అలాగే 69 సంస్కార్ కాలనీ, రెక్కీ ఆమె సినిమాల్లో రొమాంటిక్స్ సీన్స్ లో ఈ బ్యూటీ రెచ్చిపోయి నటించింది. ఈ చిన్నదాని అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.  తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. సమాజంలో వేశ్యలను చాలా చులకనగా చూస్తుంటారు. వేశ్య వృత్తిలోకి ఎవ్వరూ కావాలని రారు. ఆర్ధిక పరిస్థితులు కారణంగా అలా మారుతారు. మగాళ్లు వేశ్యల దగ్గర వెళ్లి.. కోరికలు తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి వచ్చేయొచ్చుగా కానీ అలా చేయరు. వేశ్యలు సమాజంలో ఉన్నారు అంటే వారిని వాడుకునేవారు కూడా ఉన్నారని అర్ధం.. మగాళ్లు వాళ్ళ దగ్గరకు వెళ్లకపోతే వేశ్యలు ఉండేవారు కాదేమో.. ఈ వ్యవస్థను ప్రోత్సహించేది కూడా మగాళ్లే అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో