Pradeep Ranganathan : సామాన్య జిరాక్స్ షాప్ ఓనర్ కొడుకు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్.. డ్యూడ్ సినిమా హీరో ఆస్తులు ఎంతంటే..
ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమాలపై ఆసక్తితో ఇంజనీరింగ్ లోనే దర్శకుడిగా షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యారు. లవ్ టూడే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్.. ఇప్పుడు డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో గురించి తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన ఆయన.. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రదీప్ వ్యక్తిగత విషయాలు, సంపాదన గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. తమిళనాడులోని చెన్నైలో జూలై 25, 1993న జన్మించిన ప్రదీప్ రంగనాథన్… ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ఆయన.. 2019లో కోమలి సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఉత్తమ తొలి దర్శకుడిగా SIIMA అవార్డును అందుకున్నారు. శ్రీ శివసుబ్రమణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రదీప్.. ఆ తర్వాత వాట్సాప్ కాదల్, కాలేజ్ డైరీస్, టీవీ కాదై వంటి షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
2022లో లవ్ టుడే సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకు ఆయనే స్వయంగా రచించి దర్శకత్వం వహించారు. ఇందులో ఇవానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రదీప్ రూ.70 లక్షలు పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయనకు మరో రూ.80 లక్షలు బహుమతిగా అందించారు. దీంతో హీరోగా మొదటి సినిమాకే రూ.1.5 కోట్లు అందుకున్నారు. ఇక తర్వాత ఈ ఏడాదిలో డ్రాగన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
డ్రాగన్ సినిమాతోపాటు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో సహా తన రాబోయే ప్రాజెక్టులకు ప్రదీప్ మొత్తం జీతం దాదాపు రూ.17 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ హీరో సంవత్సరానికి రూ.15 కోట్ల వరకు సంపాదిస్తున్నారట. ఇక ఒక్కో సినిమాకు కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. రచయితగా, దర్శకుడిగా, హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు ప్రదీప్.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..




