Megastar Chiranjeevi: డాడీ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మేనల్లుడిగా నటించిన అల్లు అర్జున్.. ఆ చిత్రమేంటో తెలుసా ?..

బన్నీ హీరోగా అరంగేట్రం చేసిన సినిమా గంగోత్రి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా బన్నీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక హీరోగా కాకముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కనిపించారు.

Megastar Chiranjeevi: డాడీ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మేనల్లుడిగా నటించిన అల్లు అర్జున్.. ఆ చిత్రమేంటో తెలుసా ?..
Allu Arjun, Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 26, 2022 | 8:09 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. పక్కా ఊర మాస్ లుక్‏లో బన్నీ నటనకు దేశమే ఫిదా అయ్యింది. అయితే హీరోగా నటించకముందే పలు చిత్రాల్లో నటించాడన్న సంగతి తెలిసిందే. బన్నీ హీరోగా అరంగేట్రం చేసిన సినిమా గంగోత్రి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా బన్నీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక హీరోగా కాకముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కనిపించారు. చిరు వద్ద డాన్స్ నేర్చుకునే కుర్రాడిగా నటించారు బన్నీ. అయితే ఈ సినిమా కంటే ముందు చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించారు. ఆ సినిమాలెంటో తెలుసుకుందామా.

డాడీ సినిమా కంటే ముందు బన్నీ చిరు నటించిన ఓ సినిమాలో ఆయన మేనల్లుడిగా కనిపించారు. ఆ చిత్రమే విజేత. 1985 లో వచ్చిన ఈ మూవీలో మేగాస్టార్ మేనల్లుడిగా కనిపించారు. ఇక ఆ తర్వాత 1986లో కమల్ హసన్, కె. విశ్వనాథ్ కాంబోలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలోనూ నటించారు. కమల్ హసన్ మనవళ్లలో ఒకరిగా బన్నీ కనిపించారు.

ఇక గంగోత్రి సినిమా హీరోగా మారిన బన్నీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ ఒక్కసారిగా క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాజిల్.. సునీల్, అనసూయ కీలకపాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి