- Telugu News Entertainment Tollywood Actress Pavitra Lokesh Complained To Cybercrime Police telugu cinema news
Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..
తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‌తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Updated on: Nov 27, 2022 | 3:08 PM

Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..

తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‌తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ ఇద్దరి ఫోటోస్ మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర కామెంట్లతో వాటిని వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇద్దరిని ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ పై ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదే అంశం గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి.

తమ గురించి వస్తున్న వార్తలపై పవిత్రా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

తాజాగా మరోసారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశ పూర్వక రాతలను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్ర ఫిర్యాదుతో ట్రోలర్స్‌పై ఆరా తీస్తున్న పోలీసులు

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్.. వారిపై కంప్లైంట్ చేసిన నటి..