Tollywood: తెల్ల చామంతుల చాటున దాగిన అందం.. ఉంగరాల కురులతో దొంగచూపులు చూస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టండి..

పైన ఫోటోలో చూశారు కదా.. ఉంగరాల కురుల చిన్నది..ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ యూత్‏లో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Tollywood: తెల్ల చామంతుల చాటున దాగిన అందం.. ఉంగరాల కురులతో దొంగచూపులు చూస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 26, 2022 | 7:19 PM

అందం, అభినయంతో సినీ పరిశ్రమలో సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్న నటీమణులు అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని వరుస అవకాశాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. కృతి శెట్టి, శ్రీలీల, కేతిక వంటి కుర్ర హీరోయిన్స్ తెలుగు పరిశ్రమలో తెగ బిజీ అయ్యారు. ఇక కొద్ది రోజుల క్రితం మరో యంగ్ హీరోయిన్ సైతం సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే యమ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పైన ఫోటోలో చూశారు కదా.. ఉంగరాల కురుల చిన్నది..ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ యూత్‏లో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది. గుర్తుపట్టగలరా. ఈ చిన్నది నార్త్ అమ్మాయి. పుట్టి పెరిగింది అంతా బాంబేలోనే. హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అంతేకాదు.. ఓటీటీలోనూ సందడి చేసింది. కనిపెట్టారా ?. తెల్ల చామంతుల చాటున దాగిన ఆ అందాల చిన్నది మరెవరో కాదండి.. మిథిలా పాల్కర్. మజా హనీమూన్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కట్టి బట్టి, కారవాన్, చాప్ స్టిక్లు వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో మిథిలా అనుపాల్ రాజ్ అనే పాత్రలో నటించింది. సిటీలో అమ్మాయి… స్మాల్ థింగ్స్ వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.