Tollywood: సౌందర్య నిర్మించిన ఏకైక చిత్రం ఎంతో తెల్సా.? ఏకంగా రెండు జాతీయ అవార్డులు సాధించింది

మహానటి సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అలనాటి తార సౌందర్య. సాంప్రదాయమైన క్యారెక్టర్లలో నటించి ఏమాత్రం గ్లామర్‌కు ఆస్కారం ఇవ్వకుండా.. తన నటనతోనే భారీగా పాపులారిటీ సాధించింది ఈ అందాల నటి.

Tollywood: సౌందర్య నిర్మించిన ఏకైక చిత్రం ఎంతో తెల్సా.? ఏకంగా రెండు జాతీయ అవార్డులు సాధించింది
Soundarya
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 11, 2024 | 7:46 PM

మహానటి సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అలనాటి తార సౌందర్య. సాంప్రదాయమైన క్యారెక్టర్లలో నటించి ఏమాత్రం గ్లామర్‌కు ఆస్కారం ఇవ్వకుండా.. తన నటనతోనే భారీగా పాపులారిటీ సాధించింది ఈ అందాల నటి. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన సౌందర్యను.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. కన్నడ కస్తూరి అయిన సౌందర్య.. పేరు, గుర్తింపు మాత్రం తెలుగు సినిమాల ద్వారానే తెచ్చుకుంది. ఆమె మన మధ్య లేకపోయినా.. నటించిన చిత్రాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

సౌందర్య తండ్రి సత్యనారాయణ అయ్యర్.. ఈయన కన్నడలో నిర్మాతగా, రైటర్‌గా, అలాగే పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అసలు సౌందర్యకు సినిమాలంటే ఇష్టం లేదు. కానీ ఓ సినిమాకు ఒక చిన్న పాత్ర కోసం అమ్మాయి కావాల్సి వస్తే.. తన కూతురు ఉంది కదా అని సౌందర్యను సెట్‌కి తీసుకెళ్లారు ఆమె తండ్రి. ఆమెకి ఆ సమయంలో సినిమాలు అంటే ఇష్టం లేదు.. సౌందర్య ఇష్టాన్ని ఆమె తండ్రి గౌరవించకపోవడంతో.. తన తండ్రితో మాట్లాడటమే మానేసింది. ఇక అలా సౌందర్య నట ప్రస్థానం మొదలైంది.

సౌందర్య నిర్మించిన చిత్రమిదే..

తండ్రి మరణాంతరం ఆయన పేరు మీదే ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించింది సౌందర్య. సత్యం మూవీ మేకర్స్ పేరుతో 2002లో ‘ద్వీప’ అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. దీనికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించాడు. ఫిమేల్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో.. సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఇది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్ అవ్వకపోయినా.. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె నిర్మాతగా సినిమాలు రూపొందించలేదు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి