Priyamani: ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్.. మరి ప్రియమణి తొలి జీతం ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?
అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి పుట్టిన రోజు ఇవాళ (జూన్ 04). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియమణి ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. దీనికి తగ్గట్టుగానే కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటోంది.
ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అందాల తారకు మంచి క్రేజ్ ఉంది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి పుట్టిన రోజు ఇవాళ (జూన్ 04). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియమణి ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. దీనికి తగ్గట్టుగానే కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటోంది. రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో సుచిత్ర పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది ప్రియమణి. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందామె. ఇలా ప్రస్తుతం కోట్లలో ఆదాయాన్ని గడిస్తోన్న ప్రియమణి మొదటి జీతం ఎంతో తెలుసా? కేవలం 500 రూపాయలు మాత్రమే.
2003లో తెలుగులో ‘ఎవరే అతగాడు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ప్రియమణి. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల పక్కన గ్లామరస్ హీరోయిన్ పాత్రలు చేస్తూనే, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తన మొదటి పారితోషకం గురించి ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చింది ప్రియమణి. ‘నా మొదటి జీతం 500 రూపాయలు. ఆ డబ్బు నేనే ఉంచుకున్నాను. ఇది మోడలింగ్ ద్వారా వచ్చిన డబ్బు అని అంటున్నారు. ‘నా సినిమాలో నేను పాడాలి. సినిమాలో మేకప్ లేకుండా కనిపించాలని ఉంది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
ప్రియమణికి శుభాకాంక్షల వెల్లువ..
Wishing A Very Happy Birthday to the talented and stunning actor #Priyamani🎉
Wishing you a year filled with joy, success, and unforgettable moments 🥳 #HappyBirthdayPriyamani#HBDPriyamani pic.twitter.com/3MncSEXHDp
— Sri Lakshmi Narasimha Movie Makers (@SLNMOVIEMAKERS) June 4, 2024
కాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కి కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. గతేడాది షారుఖ్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన ‘జవాన్’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది ప్రియమణి చాలా బిజీగా ఉంది. ‘భామాకలాపం 2’, ‘ఆర్టికల్ 370’ ఇప్పటికే విడుదలయ్యాయి. ‘మైదాన్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆయన 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.
Wishing a Very Happy Birthday To The Talented Actress #Priyamani 😍 .#HBDPriyamani #HappyBirthdayPriyamani #Priyamani #ActressPriyamani #SSMusic pic.twitter.com/LeUPPxj3It
— SS Music (@SSMusicTweet) June 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.