Pushpa 2: కపుల్ సాంగ్ కోసం 500 మందికి పైగా డ్యాన్సర్స్.. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆసక్తికర కామెంట్స్..

ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇటీవల రిలీజ్ అయిన కపుల్ సాంగ్ సూసేకి అగ్గి మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే సెకండ్ సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బన్నీ, రష్మిక కెమిస్ట్రీ, హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ ఇన్ స్టాలో ట్రెండ్ అవుతుండగా.. చిన్న, పెద్ద సూసేకీ పాటకు స్టెప్పులేస్తున్నారు.

Pushpa 2: కపుల్ సాంగ్ కోసం 500 మందికి పైగా డ్యాన్సర్స్.. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆసక్తికర కామెంట్స్..
Ganesh Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 04, 2024 | 3:03 PM

ఈ ఏడాది విడుదల కానున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప చిత్రానికి మించి సెకండ్ పార్ట్ ఉంటుందని మేకర్స్ ముందు నుంచి చెప్పడంతో పుష్ప 2పై మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇటీవల రిలీజ్ అయిన కపుల్ సాంగ్ సూసేకి అగ్గి మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే సెకండ్ సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బన్నీ, రష్మిక కెమిస్ట్రీ, హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ ఇన్ స్టాలో ట్రెండ్ అవుతుండగా.. చిన్న, పెద్ద సూసేకీ పాటకు స్టెప్పులేస్తున్నారు.

సూసేకీ పాటకు కొరియోగ్రఫీ అందించిన గణేశ్ ఆచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “సూసేకీ.. స్వీట్ సాంగ్.. ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించాం. కానీ అసలైన డ్యాన్స్ చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎనిమిది రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయ్యింది. 500 మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొన్నారు. కపుల్స్ కూడా తేలిగ్గా డ్యాన్స్ చేయగలిగేలా హుక్ స్టెప్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యాము. అందుకు తగ్గట్టే కొరియోగ్రఫీ చేశాము. అల్లు అర్జున్, రష్మిక తమ డ్యాన్స్ తో అలరిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.

గణేశ్ ఆచార్య ఇదివరకు పుష్ప ఫస్ట్ పార్టుకు కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో సమంత నటించిన సెన్సెషనల్ సాంగ్ ఊ అంటావా మావ.. పాటకు కొరియోగ్రఫీ అందించారు గణేశ్ ఆచార్య. అప్పట్లో ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో సమంత, బన్నీ డాన్స్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి పుష్ప 2లో కపుల్ సాంగ్ కోసం వర్క్ చేశాడు గణేశ్ ఆచార్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించగా.. ఈసారి సెకండ్ పార్టులోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!