Taraka Ratna: తారకరత్న తండ్రి మోహన కృష్ణ గురించి తెలుసా ?.. సినీ ఇండస్ట్రీలో కీలక బాధ్యతలో..
23 రోజులుగా మృత్యువుతో పోరాడి విధి చేతిలో ఓడిపోయారు. తారకరత్న మృతి వార్త సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తారకరత్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని… ఒక్క ఏడాదిలోనే 9 చిత్రాలను అనౌన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేసారు. ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ రావడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. హీరోగా కాకుండా.. విలక్షణ నటుడిగా తారకరత్న నటనకు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూనే అటు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతలోనే గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి విధి చేతిలో ఓడిపోయారు. తారకరత్న మృతి వార్త సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు.. 39 ఏళ్ల వయసులోనే ఎన్నో అటు పోట్లను ఎదుర్కొన్నారు. ప్రేమ కోసం పెద్దలను ఎదురించి కుటుంబానికి దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులకు దగ్గరవుతున్న సమయంలో అనంతలోకాలకు పయనమయ్యారు తారకరత్న. ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. నందమూరి తారకరామారావు తనయుడు మోహన కృష్ణ కుమారుడే తారకరత్న. మోహన కృష్ణ కూడా ఇండస్ట్రీకి చెందినవారని చాలా మందికి తెలియదు.
చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న ఆయన నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. అంతేకాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కెమెరామెన్ గా ఎదిగారు. ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహన కృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అనురాగ దేవత సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు.




చివరగా కుమారుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
