Gold Price: మహిళలకు ఇది కదా కావాల్సింది.. బంగారం ధర భారీగా పతనం.. రూ.23 వేలు తగ్గిన వెండి
Gold and Silver Rates: మంగళవారం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. ఎన్నడు లేని విధంగా రెండు లోహాలపై భారీ తగ్గింపు కనిపిస్తోంది. ఇది మహిళలకు గుడ్‌న్యూ్‌స్ అనే చెప్పాలి. రోజూ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీ స్థాయిలో పతనం కావడం గమనార్హం..

Gold and Silver Rates: రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా దిగి వచ్చాయి. ఇది మహిళలకు ఎంతో ఉపశమనం కలిగించే వార్త. నిన్నటి రోజు తులం బంగారం ధర 1 లక్షా 42 వేల వరకు ఉన్న బంగారం ధరలకు మంగళవారం ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అంతేకాదు వెండి కూడా భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టిందంటే ఆశ్చర్యపోవాల్సిందే.
బంగారం, వెండి ధర ఎంత తగ్గింది?
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 3,050 రూపాయలు తగ్గుముఖం పట్టగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 2,800 రూపాయల వరకు తగ్గింది. ఇక 18 క్యారెట్లపై 2,510 రూపాయలు తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై ఏకంగా 18000 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక నిన్నటికి ఇప్పటికి బంగారం ధర తులంపై ఏకంగా 6000 రూపాయల వరకు పతనమైపోయింది. వెండి కూడా భారీగానే పతనమైంది.
ఇది కూడా చదవండి: Bharat Taxi App: గుడ్‌న్యూస్.. ఇక ఆ టెన్షన్ అక్కర్లేదు.. జనవరి 1న భారత్ ట్యాక్సీ యాప్.. ఫీచర్స్ ఇవే!
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి?
ఇక బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,24,850 రూపాయలు ఉంది. అలాగే 18 క్యారెట్ల పసిడి ధర 1,01,930 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం కిలో వెండి ధర 2,40,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఏదీ ఏమైనా ఇంత భారీ ఎత్తున ధరలు తగ్గడం మహిళలకు భారీ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,36,200 ఉండగా, కిలో వెండి ధర రూ.2,58,000 ఉంది.
ఇది కూడా చదవండి: LIC Scheme: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం రూ.20 వేల పెన్షన్.. ఎవరు అర్హులు!
ఈ సంవత్సరం చివరి నెలలో బంగారం అనేకసార్లు రికార్డు స్థాయిని తాకింది. అయితే నేడు 30 డిసెంబర్ 2025న బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. వెండి కూడా దాని రికార్డు ధరతో పోలిస్తే భారీగా పడిపోయింది. ఈ ఖరీదైన లోహం దాదాపు 11 శాతం తగ్గింది.
ఇది కూడా చదవండి: Business Idea: కేవలం రూ.50,000తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.. ఏడాదికి రూ.10 లక్షల వరకు సంపాదించండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




