AR Rahman: ఒక్కో పాటకు 3 కోట్లు.. ఏఆర్ రెహమాన్ లైఫ్ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.. ఆస్తులు ఎంతంటే ..

ఇప్పుడు ఎక్కడ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పేరు మారుమోగుతుంది. ఇన్నాళ్లు సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతల హృదయాలను దొచుకున్నాడు. కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో మరోసారి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.

AR Rahman: ఒక్కో పాటకు 3 కోట్లు.. ఏఆర్ రెహమాన్ లైఫ్ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.. ఆస్తులు ఎంతంటే ..
Ar Rahman
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 21, 2024 | 11:20 AM

భారతీ సినీరంగంలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రోజా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన రెహమాన్.. ఇప్పటివరకు రెండుసార్లు ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. కానీ ఇప్పుడు 57 ఏళ్ల వయసులో తన భార్య సైరా బాను నుంచి విడాకులు తీసుకుంటున్నాడు. వీరిద్దరి వివాహం 1995లో జరిగింది. మనస్పర్థల కారణంగానే వీరిద్దరు విడిపోతున్నట్లు రెహమాన్ భార్య సైరా తరపు లాయర్ ప్రకటించింది. పెళ్లైన మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి విడిపోతున్నారు. దీంతో ఇప్పుడు రెహమాన్ లైఫ్ గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

భారతదేశంలోని అత్యంత ధనవంతులైన సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ ఒకరు. నివేదికల ప్రకారం ఇప్పటివరకు రెహమాన్ ఆస్తి రూ. 1728 కోట్లు. సినిమాలు, సాంగ్స్, లైవ్ ఈవెంట్స్ ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతోనూ సంపాదిస్తున్నారు. అలాగే సినిమాల్లో పాటలు పాడేందుకు రెహమాన్ ఒక్కో పాటకు రూ.3 కోట్లు తీసుకుంటాడు. అలాగే ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా వసూలు చేసే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్. లైవ్ షో కోసం రూ.2 కోట్లు తీసుకుంటాడు.

ఇవి కూడా చదవండి

రెహమాన్ ఆస్తులు..

లాస్ ఏంజిల్స్‌లోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఇది అతడు స్టూడియోగా ఉపయోగిస్తున్నాడు. అలాగే చెన్నైలో వ్యక్తిగత సంగీత స్టూడియో ఉంది. దుబాయ్, లండన్, ఇతర దేశాలలోనూ రెహమాన్ సొంత స్టూడియోస్ ఉన్నాయి. రెహమాన్ కు కార్లు అంటే ఆసక్తి ఎక్కువ. అతడి గ్యారేజీలో వోల్వో SUV, మెర్సిడెస్-బెంజ్ రూ. 3 కోట్లు, జాగ్వార్ ధర రూ. 1 కోటి, పోర్స్చే టైకాన్ EV కార్లు ఉన్నాయి.

మూడు దశాబ్దాల సినీ ప్రియాణంలో ఇప్పటివరకు రెండు ఆస్కార్ అవార్డులు.. రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బాఫ్టా, పద్మభూషణ్ తో సహా పలు అవార్డులను గెలుచుకున్నారు. 1992లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసిన రెహమాన్ ఇప్పటివరకు దాదాపు 2000 లకు పైగా పాటలను కంపోజ్ చేశాడు.

View this post on Instagram

A post shared by ARR (@arrahman)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నుమాయిష్‌లో షాపింగ్ చేసిన టాలీవుడ్ ప్రముఖ నటి.. గుర్తు పట్టారా?
నుమాయిష్‌లో షాపింగ్ చేసిన టాలీవుడ్ ప్రముఖ నటి.. గుర్తు పట్టారా?
పదో తరగతి అర్హతతో రైల్వేలో 1154 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో రైల్వేలో 1154 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
సంక్షేమ పథకాలకు వెసులుబాటు దొరకడం లేదు: సీఎం చంద్రబాబు
సంక్షేమ పథకాలకు వెసులుబాటు దొరకడం లేదు: సీఎం చంద్రబాబు
మహిళను చంపిన నిందితుడిని పట్టించిన కండోమ్.. అసలేం జరిగిందంటే..
మహిళను చంపిన నిందితుడిని పట్టించిన కండోమ్.. అసలేం జరిగిందంటే..
త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. మంత్రి
త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. మంత్రి
కారు, బైక్‌కు ఇన్సూరెన్స్ లేదా? ఇక నుంచి నో పెట్రోల్‌, డీజిల్‌..
కారు, బైక్‌కు ఇన్సూరెన్స్ లేదా? ఇక నుంచి నో పెట్రోల్‌, డీజిల్‌..
ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం! ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం! ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
JEE Main 2025 సెషన్‌ 1 రెండో దశ పరీక్షలు నేటి నుంచి పునఃప్రారంభం
JEE Main 2025 సెషన్‌ 1 రెండో దశ పరీక్షలు నేటి నుంచి పునఃప్రారంభం
మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..