Vehicle Insurance: మీ కారు, బైక్‌కు ఇన్సూరెన్స్ లేదా? ఇక నుంచి నో పెట్రోల్, డీజిల్.. ఫాస్ట్‌ట్యాగ్ కూడా తీసుకోలేరు!
Vehicle Insurance: భారతదేశంలోని అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అయింది. ఇందులో ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. మీకు కారు లేదా బైక్-స్కూటర్ ఉన్నా వాటికి బీమా చేయడం ముఖ్యం. ఇప్పుడు భారతీయ రోడ్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధం. దీని కోసం మీరు..

వాహనాల విషయంలో నిబంధనలు రోజురోజుకు మారిపోతున్నాయి. మారిన రూల్స్‌ను ముందుస్తగా గమనిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త నిబంధనల ప్రకారం, మీ వాహనానికి బీమా అనేది తప్పనిసరిగ్గా ఉండాల్సిందే. లేకుంటే మీరు మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా లేకుండా ఇంధనం (పెట్రోల్ లేదా డీజిల్) కొనుగోలు చేయలేరు. ఇంధనం కోసం మాత్రమే కాదండోయ్.. మీరు FASTag కోసం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు కూడా చూపించవలసి ఉంటుంది. అంటే మీరు మీ వాహనంలో చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా పాలసీని కలిగి ఉంటే, అది కూడా ఫాస్ట్‌ట్యాగ్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది.
మీకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రూఫ్ ఉంటే మాత్రమే, మీరు మీ వాహనంలో పెట్రోల్, డీజిల్‌ను వేసుకోవచ్చు. దీంతో ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇంధనం కొనుగోలు చేయడానికి, ఫాస్ట్‌ట్యాగ్, పొల్యూషన్, లైసెన్స్ సర్టిఫికేట్‌లను పొందడానికి వాహనాలకు బీమా రుజువును చూపించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
థర్డ్ పార్టీ బీమా అవసరం:
భారతదేశంలోని అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అయింది. ఇందులో ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. మీకు కారు లేదా బైక్-స్కూటర్ ఉన్నా వాటికి బీమా చేయడం ముఖ్యం. ఇప్పుడు భారతీయ రోడ్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధం. దీని కోసం మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీ వాహనం వల్ల థర్డ్ పార్టీలకు కలిగే నష్టం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే, మీ థర్డ్ పార్టీ బీమా నష్టాన్ని కవర్ చేస్తుంది.
మోటారు వాహన చట్టం ఏం చెబుతోంది?
మోటారు వాహన చట్టం ప్రకారం.. రోడ్డుపై తిరిగే అన్ని వాహనాలకు తప్పనిసరిగా థర్డ్-పార్టీ బీమా కవరేజీ ఉండాలి. కొత్త బీమాను కొనుగోలు చేసేటప్పుడు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా పాలసీతో ఫాస్ట్‌ట్యాగ్‌ని లింక్ చేయడం కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఫాస్ట్‌ట్యాగ్‌తో లింక్ చేయడం ఎందుకు అవసరం?
అంటే పెట్రోల్ పంపుల వద్ద వాహనంలో ఇంధనం నింపే ముందు బీమా రుజువు ఉన్నట్లు తెలుస్తుంది. తరచుగా ప్రతిదీ FASTag వ్యవస్థ ద్వారా తనిఖీ చేస్తారు. అటువంటి పరిస్థితిలో బీమాను ఫాస్టాగ్‌కు కూడా జోడించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా ? లేదా అనేది తప్పనిసరిగ్గా తెలుస్తుంది.
50 శాతం వాహనాలకు మాత్రమే థర్డ్ పార్టీ బీమా
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రకారం, 2024లో భారతీయ రోడ్లపై అంచనా వేయబడిన 35–40 కోట్ల వాహనాల్లో కేవలం 50% మాత్రమే థర్డ్-పార్టీ బీమాను కలిగి ఉన్నాయి. థర్డ్ పార్టీ బీమా లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం. మొదటిసారి నేరం చేసిన వ్యక్తికి రూ. 2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా రూ.4,000 వరకు పెరుగుతుంది.
ఫాస్ట్‌ట్యాగ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం బీమా సమ్మతిని పెంచడంలో సహాయపడుతుందని డెలాయిట్ భాగస్వామి, ఆటోమోటివ్ రంగ నాయకుడు రజత్ మహాజన్ అన్నారు. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు డిసెంబర్ 2024లో రూ.6,642 కోట్లకు చేరుకున్నాయి. బీమా ధృవీకరణను FASTag, ఇతర డిజిటల్ సేవలకు లింక్ చేయడం ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించవచ్చు. ఇలా చేయడవం వల్ల దేశవ్యాప్తంగా బీమా కవరేజీని పెంచే అవకాశం ఉంటుంది.
కేంద్రం చర్యలు
భారతదేశంలో ప్రతి వాహనానికి బీమా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠినమైన జరిమానాలు ఉన్నప్పటికీ, భారతీయ వాహనాలకు బీమా అనేది ఉండటం లేదు. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, అన్ని మోటారు వాహనాలు తప్పనిసరిగా థర్డ్-పార్టీ రిస్క్‌లను కవర్ చేసే బీమా పాలసీని కలిగి ఉండాలి. లేకుంటే వాహనదారులకు మూడు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
వాహన సర్వీస్ రూల్స్‌లో మార్పులు
మీడియా కథనాల ప్రకారం.. త్వరలో వాహన సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసే ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఇందులో వాహన సంబంధిత సేవలను బీమా కవరేజీ రుజువుతో కలపవచ్చు. అంతేకాకుండా ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ బీమాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు ప్రతిపాదించింది. ఇందులో బీమా లేని వాహనాలను ఇంధనం నింపకుండా ఆపడం, ఫాస్టాగ్ లేన్‌లను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, వాహన సేవలను బీమా కవరేజీతో అనుసంధానం చేయడం కూడా పరిశీలిస్తోంది.
ఇది కూడా చదవండి: Union Budget 2025: అత్యధిక బడ్జెట్‌ను సమర్పించిన మంత్రులు ఎవరు..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి