Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో 28న పాఠశాలలు, కళాశాలలకు సెలవు!
School Holiday: షబ్ ఏ మేరాజ్ ఆప్షనల్ హాలిడే ఉన్నందున మిగతా విద్యాసంస్థల స్వీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక జమ్మూ కశ్మర్‌తోపాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం షబ్ ఏ మేరాజ్ సందర్భంగా ఆ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో కేవలం మైనార్టీ స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే సెలవు ఉండవచ్చు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. జనవరి 28న పాఠశాలలు, కళాశాలలకు సెలవు రానుంది. 28న షబ్ ఏ మేరాజ్ ఆప్షనల్ హాలిడే. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు రానుంది. అయితే ఈ నెలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరో రోజు సెలవు రానుంది.
షబ్ ఏ మేరాజ్ అంటే ముస్లింలా పండుగ. ఈ రోజు వారు రాత్రంతా జాగరణ చేస్తారు. మసీదులను ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక ఘనంగా జరుపుకొంటారు. అయితే సెలవు అనేది అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఉండకపోవచ్చు. ఆప్షనల్ హాలిడే కాబట్టి విద్యాసంస్థల నిర్ణయం మేరకే సెలవు ఉంటుంది.
గత ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ షబ్ ఏ మేరాజ్ నిర్వహించారు. అయితే, అప్పుడు ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు పలు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. అయితే, ఈసారి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేకపోయినా చాలా విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి.
షబ్ ఏ మేరాజ్ ఆప్షనల్ హాలిడే ఉన్నందున మిగతా విద్యాసంస్థల స్వీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక జమ్మూ కశ్మర్‌తోపాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం షబ్ ఏ మేరాజ్ సందర్భంగా ఆ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో కేవలం మైనార్టీ స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే సెలవు ఉండవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి