Actress Hansika: వారెవ్వా.. ఏం వయ్యారం గురూ.. అందాల ఫోజులతో కేకపుట్టిస్తోన్న హాన్సిక.. ఫోటోస్ చూస్తే..
బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే సినిమాలు, యాడ్స్ అంటూ బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తెలుగు, హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించి అలరించింది. ఇప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు.
Updated on: Nov 21, 2024 | 10:56 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.

ఈ సినిమా తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఈ అమ్మడు నటనకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. కొన్నాళ్ల క్రితమే టాలీవుడ్ టూ బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.

తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా తెత్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2022లో తన స్నేహితుడి సోహైల్ కతూరియాను వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హాన్సిక.. ఇప్పుడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ కమ్ ట్రెడిషనల్ వేర్ లో దిమ్మతిరిగే ఫోజులతో మతిపోగొట్టేస్తోంది హాన్సిక.




