- Telugu News Photo Gallery Cinema photos Hero Balakrishna upcoming movies shooting updates and his son Mokshagna Teja movie competitions
Balakrishna: బాలయ్య vs మోక్షజ్ఞ.! తండ్రి కొడుకులు మధ్య పోరు సిద్ధం..
నందమూరి అభిమానులకు డబుల్ బొనాంజా రెడీ అవుతోంది. మేం ఇచ్చే అప్‌డేట్లు అందరూ ఇచ్చేలా సాదాసీదాగా ఉండవు. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. కడుపు నిండింది.. ఇక చాలు అనేలా వడ్డిస్తాం అంటూ ఊరిస్తున్నారు నందమూరి బాలయ్య. కొడుకుతో కలిసి హల్‌చల్ చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి అందగాడు. డాకు మహరాజ్ టైటిల్‌ని మాత్రమే అనౌన్స్ చేస్తారనుకుంటే అంతకు మించిన అప్‌డేట్స్ తో కిక్ ఇచ్చేశారు బాలయ్య.
Updated on: Nov 20, 2024 | 9:41 PM

ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్‌లో పాస్ అవుతారా అనేది ఫిల్మ్ నగర్‌లో డిస్కస్ అవుతున్న పాయింట్.

బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేస్తున్నారు.

డాకు మహరాజ్ టైటిల్‌ని మాత్రమే అనౌన్స్ చేస్తారనుకుంటే అంతకు మించిన అప్‌డేట్స్ తో కిక్ ఇచ్చేశారు బాలయ్య.

ఓ వైపు ఆ సినిమా సందట్లో ఉంటూనే మరోవైపు అఖండ సీక్వెల్ తాండవం ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్‌లో అఖండ 2 మొదలవుతుంది.

ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులందరితోనూ కీ సీక్వెన్స్ ప్లాన్ చేశారట బోయపాటి. ఫస్ట్ పార్ట్ ని మించేలా సెకండ్ పార్టు ఉండేలా స్క్రిప్ట్ ని అద్భుతంగా డీల్ చేశారట.

చాలా రోజుల నుంచి నందమూరి అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ 2పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

డిసెంబర్ నుంచే రెగ్యలర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారు.





