27 January 2025

నా బాడీ నా ఇష్టం.. ఇలాగే ఉంటానంటోన్న సింగర్..

Rajitha Chanti

Pic credit - Instagram

సోషల్ మీడియా కారణంగా ఎంతో మంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లేనిపోని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. 

ఇక నెట్టింట సెలబ్రెటీల పై జరిగే ట్రోల్స్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్, మేకప్ పై ఏదోక ట్రోల్ జరుగుతూనే ఉంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ సింగర్ సైతం తన డ్రెస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది. అయితే ఆ విమర్శలకు తనస్టైల్లో అదిరిపోయే కౌంటరిచ్చింది. 

తన మధురమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించింది. అందంలో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు దామిని భట్ల. 

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చ బొట్టేసినా అనే పాటతో చాలా ఫేమస్ అయ్యింది దామిని భట్ల. అంతకు ముందు చాలా పాటలు పాడింది.

అద్భుతమైన పాటలు ఆలపించిన దామిని.. అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్నో రియాల్టీ షోలలో పాల్గొని గాయనిగా పేరు తెచ్చుకుంది. 

2014లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టిన దామిని.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. నెట్టింట మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.