సింపుల్ శారీలో మెరిసిపోతున్న జాన్వీ.. దాని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

samatha.j

28 January 2025

Credit: Instagram

శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ బ్యూటీ తెల్లటి చీరలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆఫొటోలను అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

కేరళకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, వైట్ కలర్ శారీలో మెరిసిపోయింది. చీరలోఅందంతో ఎంతో క్యూట్‌గా ఉంది ఈముద్దుగుమ్మ.

అయితే ప్రస్తుతం ఆ తెల్ల చీర ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం?

చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించే ఆ చీరను జాన్వీ చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసింద్గున్నారు కొందరు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జాన్వి కపూర్ కట్టుకున్న వైట్ లెనిన్ శారీ ధర అక్షరాల రూ. 2,47,000 అని తెలుస్తోంది. అంతేకాదు ఈ చీర అనవిలా అనే బ్రాండ్ కు సంబంధించిందని సమాచారం.

దీంతో ఏంటీ ఇంత సింపుల్ శారీనీ జాన్వి అన్ని లక్షలు పోసి కొన్నదా? అని ఆశ్చర్యపోతున్నారు తన అభిమానులు, నెటిజన్లు.