27 January 2025

14 ఏళ్లకే హీరోయిన్.. ఇప్పుడు 3 నిమిషాల పాటకు 2 కోట్లు తీసుకుంటుంది.. 

Rajitha Chanti

Pic credit - Instagram

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టింది. 14 ఏళ్లకే హీరోయిన్‏గా ఓ సినిమాలో నటించి మెప్పించింది ఈ సుందరి. 

ఆమె అందరూ హీరోలకు ఫెవరెట్ హీరోయిన్‏గా మారిపోయింది. ఒక్క ఏడాదిలోనే అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించింది ఈ బ్యూటీ. 

ఇన్నాళ్లు వెండితెరపై హీరోయిన్‏గా మాత్రమే కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మూడు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం రూ.2 కోట్లు తీసుకుంటుంది.

ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ శ్రీలీల. ఇటీవలే పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ అంటూ రచ్చ చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. 

2017లో కిస్ అనే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా తర్వాత ఆమెకు రవితేజ సరసన ధమాకా మూవీలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో శ్రీలీలకు తెలుగులో ఆఫర్స్ ఒక్కసారిగా క్యూ కట్టాయి. భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటించింది.